ETV Bharat / sports

వచ్చీ రాగానే విధ్వంసం.. కమిన్స్​ ఫాస్టెస్ట్​ 'ఫిఫ్టీ'.. సామ్స్​ చెత్త రికార్డ్​ - kkr vs mi

Cummins Fastest Fifty: కోల్​కతా​ నైట్​రైడర్స్​ పేసర్​ పాట్​ కమిన్స్​ సునామీలా విరుచుకుపడి.. ముంబయిని ఒంటిచేత్తో ఓడించాడు. 15 బంతుల్లోనే 56 పరుగులతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్​లో ఫాస్టెస్ట్​ ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు.

KKR's Pat Cummins smashes joint-fastest fifty in IPL history

author img

By

Published : Apr 7, 2022, 8:30 AM IST

Updated : Apr 7, 2022, 2:22 PM IST

Cummins Fastest Fifty: కమిన్స్‌ రూపంలో సునామీ ముంబయిని ముంచెత్తింది. అనూహ్యమైన షాట్లు ఆడుతూ.. కోల్​కతా నైట్​రైడర్స్​కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ముంబయి ఇండియన్స్​ బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి 15 బంతుల్లోనే 56 పరుగులతో అజేయంగా నిలిచి కథ ముగించాడు. ఈ క్రమంలోనే 14 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి.. ఐపీఎల్​లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును సమం చేశాడు. 2018లో దిల్లీపై పంజాబ్​ తరఫున కేఎల్​ రాహుల్​ కూడా 14 బంతుల్లోనే హాఫ్​సెంచరీ చేశాడు.

కోల్‌కతా విజయానికి చివరి అయిదు ఓవర్లలో 35 పరుగులు కావాలి. మ్యాచ్‌ మరో మూడు ఓవర్లయినా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కమిన్స్‌ ఆ అవకాశమే ఇవ్వలేదు. ఒక్క ఓవర్లోనే కథ ముగించాడు. సామ్స్‌ (1/50) బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను.. ఆ తర్వాత చివరి రెండు బంతులను 4, 6గా మలచి 16వ ఓవర్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. బంతి ఎలా, ఎక్కడ పడ్డా దానికి బౌండరీ దారే చూపించాడు. మధ్యలో ఓ బంతిని బౌండరీ దగ్గర సిక్సర్‌ వెళ్లకుండా సూర్య అద్భుతంగా అందుకున్నప్పటికీ అది నోబాల్‌గా తేలింది. 162 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది కోల్​కతా. ముంబయి ఇండియన్స్​పై కమిన్స్​కు మంచి రికార్డు ఉంది. గత 3 ఇన్నింగ్స్​ల్లో 33(12 బంతుల్లో), 53*(36 బంతుల్లో), 56*(15 బంతుల్లో) చొప్పున చేశాడు.

ఒకే ఓవర్​లో 35 పరుగులు సమర్పించుకున్న ముంబయి బౌలర్​ డేనియల్​ సామ్స్​ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో మూడో బౌలర్​గా నిలిచాడు. అంతకుముందు కొచ్చి టస్కర్​ కేరళ బౌలర్​ ప్రశాంత్​ పరమేశ్వరన్(ఆర్సీబీపై)​, ఆర్సీబీ బౌలర్​ హర్షల్​ పటేల్​(సీఎస్​కేపై) ఒకే ఓవర్లో 37 పరుగులు ఇచ్చుకున్నారు. సామ్స్​ తర్వాతి స్థానాల్లో రవి బొపారా, పర్విందర్​ ఆవానా 33 పరుగులతో ఉన్నారు.

ఇవీ చూడండి: కోహ్లీపై పాక్​ ఫ్యాన్​ కామెంట్​.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఇండియన్​!

ప్రపంచకప్‌లో టీమ్​ ఇండియా కొంప ముంచిన 'డాట్‌బాల్స్‌'!

Last Updated : Apr 7, 2022, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.