Ishant Sharma last Assignment: త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. డిసెంబర్ 26 నుంచి ఈ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించగా.. అందులో ఇషాంత్ శర్మ, రహానే, పుజారాలకు చోటిచ్చారు. వీరు కొంతకాలంగా సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల ఈ సిరీసే వీరికి చివరి అవకాశమని అంతా భావిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన ఓ బీసీసఐ అధికారి.. వారి ముగ్గురికి ఇదే చివరి టూర్ కావచ్చొని పరోక్షంగా వెల్లడించాడు.
"వైస్ కెప్టెన్‌గా రహానేను తొలగించడం ఇషాంత్‌ను కూడా పరోక్షంగా హెచ్చరించడమే. జట్టులో సీనియర్ పేసర్‌గా అతడు జట్టుకు మరింత గొప్పగా సేవలందించాలి. పుజారాకు కూడా ఇదే వర్తిస్తుంది. చాలా కాలంగా ఇతడు సరైన ప్రదర్శన చేయట్లేదు. అతడి నుంచి అద్భుత ఇన్నింగ్స్‌లను యాజమాన్యం ఆశిస్తోంది. ఒకవేళ ఈ సిరీస్‌లో వారు మంచి ప్రదర్శన చేస్తే వారి టెస్టు కెరీర్ ముందుకు సాగుతుంది. కానీ ఇషాంత్ విషయంలో మాత్రం ఇదే చివరిది కావొచ్చు."
-బీసీసీఐ అధికారి
కాగా.. శార్దూల్ ఠాకూర్, సిరాజ్ లాంటి యువ పేసర్లు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో కీలక ఆటగాళ్లుగా మారుతున్నారు. ఇక వీరికి తోడు బుమ్రా, షమీ కూడా ఉండనే ఉన్నారు. ఇషాంత్.. జట్టులో సీనియర్ పేసర్‌గా కొనసాగుతున్నాడు. కొంతకాలంగా ఇతడు టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. 12 నెలల్లో 8 టెస్టులాడిన ఇషాంత్ 14 వికెట్లు మాత్రమే సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ ఇతడి కీలక పరీక్ష కానుంది.