ETV Bharat / sports

IPL 2021: ఆర్​సీబీ ఫ్యాన్స్​కు షాక్​.. ఆల్​రౌండర్​ దూరం! - వాషింగ్టన్ సుందర్ దూరంఐపీఎల్​కు వాషింగ్టన్​ సుందర్​ దూరం

ఐపీఎల్​(IPL 2021) రెండో దశ ప్రారంభానికి ముందుకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది! టీమ్​లోని కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్(RCB Sundar) మిగిలిన లీగ్​ మ్యాచ్​లకు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో ఆకాశ్​ దీప్​(Akash Deep RCB) అనే యువక్రికెటర్​కు ఆర్​సీబీ అవకాశం ఇచ్చింది.

Washington to miss second-leg of IPL; selection in India's squad for T20 World Cup doubtful
IPL 2021: ఆర్​సీబీ ఫ్యాన్స్​కు షాక్​.. ఆల్​రౌండర్​ దూరం!
author img

By

Published : Aug 30, 2021, 1:10 PM IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు మరో షాక్‌ తగిలింది! ఆ జట్టు కీలక ఆటగాళ్లలో ఒకడైన వాషింగ్టన్‌ సుందర్‌ ఐపీఎల్‌(IPL 2021) రెండో దశకు పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆకాశ్‌దీప్‌ అనే కుర్రాడికి ఆర్‌సీబీ అవకాశం ఇచ్చింది. ఇప్పటికే ఆ జట్టుకు విదేశీ క్రికెటర్లు, కోచ్‌ దూరమయ్యారు.

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ రెండో దశ ఆరంభం కానుంది. ఇప్పటికే కొన్ని జట్లు దుబాయ్‌ చేరుకొని సాధన చేస్తున్నాయి. అక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇంకా యూఏఈకి వెళ్లలేదు. బహుశా ఈ రెండు రోజుల్లో అక్కడికి బయల్దేరే అవకాశం ఉంది.

Washington to miss second-leg of IPL; selection in India's squad for T20 World Cup doubtful
వాషింగ్టన్​ సుందర్​

అనతి కాలంలోనే వాషింగ్టన్‌ సుందర్‌(RCB Sundar) అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. ఒకప్పుడు కేవలం టీ20లకే సరిపోతాడని భావించిన అతడు ఆస్ట్రేలియాలో టెస్టు క్రికెట్లో అదరగొట్టాడు. దాంతో అతడిని ఇంగ్లాండ్‌ సిరీసుకు ఎంపిక చేశారు. కానీ, అక్కడికెళ్లిన తర్వాత సుందర్‌ గాయపడ్డాడు. ఫలితంగా తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఇప్పటికీ అతడు కోలుకోలేదని తెలుస్తోంది. దాంతో సుందర్‌ ఐపీఎల్‌కు దూరమవుతున్నాడని సమాచారం.

సుందర్‌ స్థానంలో ఆర్‌సీబీ ఆకాశ్‌దీప్‌ అనే బౌలర్‌ను ఎంచుకుంది. బెంగాల్‌ యువ క్రికెటరైన ఆకాశ్(Akash Deep RCB) ప్రస్తుతం ఆర్‌సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నాడు. ఏదేమైనా ఆ జట్టుకు సమతూకం తీసుకురావడంలో సుందర్‌ కీలకం. అటు బౌలర్‌గా ఇటు బ్యాట్స్‌మన్‌గా అతడు అదరగొడతాడు. పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయడంలో అతడే మేటి స్పిన్నర్‌. అంతేకాకుండా ఓపెనర్‌గా, మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్లోనూ పరుగులు చేయగలడు. ఇంతకు ముందే శ్రీలంక నుంచి దుష్మంత చమీరా, హసరంగను ఆర్‌సీబీ తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో కోచ్‌ సైమన్‌ కటిచ్‌ దూరమవ్వడంతో క్రికెట్‌ డైరెక్టర్‌ హెసెన్‌ ఆ బాధ్యతలు తీసుకున్నాడు.

ఇదీ చూడండి.. టీమ్​ఇండియా ఆల్​రౌండర్ రిటైర్మెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.