ఐపీఎల్లో (IPL 2021) దిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ (DC Vs KKR 2021) సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్, ఇయాన్ మోర్గాన్ (Ashwin Morgan IPL) మధ్య వాగ్వాదం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag).. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
ఐపీఎల్ 2014లో పంజాబ్ టీమ్ తరఫున ఆడాడు సెహ్వాగ్. ఆ సమయంలో సీఎస్కే తరఫున ఆడుతున్న అశ్విన్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్(Ashwin Vs Maxwell) వికెట్ తీశాడు. అప్పుడు అశ్విన్ చేసిన పనికి ధోనీ అతడిని మందలించినట్లు తెలిపాడు సెహ్వాగ్(Virender Sehwag).
"నేను పంజాబ్‌కు ఆడుతున్నప్పుడు అశ్విన్.. మ్యాక్స్‌వెల్ వికెట్ తీశాడు. అప్పుడు కొద్దిగా ధూళి తీసుకొని.. అతడిపై ఊదాడు అశ్విన్. అది నాకు నచ్చలేదు. కానీ ఆ పని క్రీడా స్ఫూర్తికి విరుద్ధమా కాదా అని నేనెప్పుడూ బయట మాట్లాడలేదు. అయితే అశ్విన్ చేసిన పనికి ఎంఎస్ ధోనీకి (Ashwin Dhoni) కొపమొచ్చి అతడిని తిట్టాడు. అలా చేయడం అశ్విన్ ఇష్టం. మ్యాచ్ తర్వాత ఈ సంఘటన గురించి ఏ ఆటగాడైనా మీడియాకు చెప్పి ఉంటే చాలా పెద్ద విషయమై ఉండేది. ఫీల్డ్‌లో జరిగిన విషయాలు బయటకు తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్లేయర్లదే."
- వీరేంద్ర సెహ్వాగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
అశ్విన్ x మోర్గాన్
కోల్కతా, దిల్లీ మ్యాచ్‌లో కేకేఆర్ ఫీల్డర్ త్రో వేయగా అది పంత్ చేతికి తాకి వెల్లింది. దీంతో ఎక్స్ట్రా రన్ తీశాడు అశ్విన్. అది నచ్చని కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ (Ashwin Morgan IPL).. క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకమని భావించినట్లు ఉన్నాడు. తర్వాతి బంతికి టిమ్ సౌథీ బౌలింగ్‌లో అశ్విన్ ఔట్ అయ్యాడు. అప్పుడు మోర్గాన్, సౌథీ, అశ్విన్‌కు (Ashwin Morgan Southee) మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. దినేశ్ కార్తీక్ సర్దిచెప్పే ప్రయత్నం చేసి వారిని దూరం పంపించేశాడు.
తెలిసినా చేసేవాడ్ని..
ఆ తర్వాత ఈ సంఘటనపై వరుస ట్వీట్లు చేసిన అశ్విన్.. బంతి పంత్ (Ashwin Morgan Pant) చేతికి తగిలినట్లు తనకు తెలియదని చెప్పాడు. ఒక వేళ తెలిసినా.. అది నిబంధనలకు విరుద్ధం కాదు కాబట్టి.. పరుగు కోసం ప్రయత్నించేవాడనని వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో (DC vs KKR 2021) 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది కేకేఆర్. దిల్లీ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించింది. మొదట ఓపెనర్ గిల్ 30 పరుగులతో రాణించగా.. నితీశ్ రానా (36*) తనదైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. సునీల్ నరేన్ చివర్లో 10 బంతుల్లో 21 పరుగులతో మెరిశాడు.
ఇవీ చూడండి:
IPL 2021 News: టాస్ గెలిచిన పంజాబ్.. కోల్కతా బ్యాటింగ్