సీఎస్కే విజయాలను లేదా ఓటములను తన ఖాతాలో వేసుకోవడానికి మొదటి కారణం ధోనీనే. ఆ తర్వాత ఇంకెవరైనా అని చెప్పాలి. అలా ఈ సారి విజయాలను మొదటి కారణం ధోనీనే. గతేడాది రవీంద్ర జడేజా, ధోనీ జట్టును నడిపించారు. కానీ ప్లాన్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ సీజన్.. తన ట్రేడ్ మార్క్ కెప్టెన్సీతో మహీ జట్టును సమర్థవంతంగా ముందుండి నడిపించాడు. కీలక సమయాల్లో మంచిగా నాయకత్వం వహించి.. జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
ఓపెనింగ్ జోడీ.. ఆ తర్వాత ఓపెనింగ్ జోడీ డేవాన్ కాన్వే (625), రుతురాజ్ గైక్వాడ్ (564). వీరిద్దరు కలసి ఈ సీజన్‌లో 15 మ్యాచుల దాకా ఆడగా.. ఫస్ట్ వికెట్‌కు 1189 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. పవర్‌ప్లేలో మంచి ఆరంభాన్ని అందించారు ఈ ఇద్దరు. ఆరెంజ్ క్యాప్ టాప్ 10 లిస్ట్‌లోనూ నిలిచారు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో రహానె ఇన్నింగ్స్ కూడా తోడయ్యాయి.
రెండోది.. ఏ టీమ్‌కైనా హోం గ్రౌండ్ అతి పెద్ద బలం. సీఎస్కే... ఈ సీజన్‌లో విజయాలను కొనసాగించడానికి చెపాక్ స్టేడియం ఓ కారణమనే చెప్పాలి. ఈ మైదానం వేదికగా.. ఈ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. ఐదింటిలో విజయం సాధించింది. ఇకపోతే ధోనీకి ఈ సీజనే లాస్ట్ మ్యాచ్ అని ప్రచారం సాగుతోంది. దీంతో మహీ ఏ స్టేడియంలో ఆడితే అక్కడికే అభిమానులు పోటెత్తారు. అలానే మహీ కోసం సీఎస్కే ప్లేయర్లు బాగా ఆడారు.
-
6️⃣0️⃣ seconds of pure 💛🫶pic.twitter.com/94nLbjvZM9
— Chennai Super Kings (@ChennaiIPL) May 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">6️⃣0️⃣ seconds of pure 💛🫶pic.twitter.com/94nLbjvZM9
— Chennai Super Kings (@ChennaiIPL) May 24, 20236️⃣0️⃣ seconds of pure 💛🫶pic.twitter.com/94nLbjvZM9
— Chennai Super Kings (@ChennaiIPL) May 24, 2023
ధోనీ మాటలతో.. ఈ సీజన్ ప్రారంభంలో బౌలర్లు విఫలమయ్యారు. వైడ్స్ ఎక్కువ వేశారు. దీంతో వైడ్స్, ఫీల్డింగ్ వైఫల్యాల గురించి ధోనీ కాస్త గట్టిగానే మాట్లాడాడు. తప్పును ఇలానే కొనసాగిస్తే.. వేరే కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడాల్సి ఉంటుందని తమ బౌలర్లకు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ మాటలు కూడా జట్టులో మార్పులు తీసుకొచ్చాయనే చెప్పాలి. అవి విజయాన్ని అందించాయి.
కుర్రోళ్లతో బౌలింగ్.. పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లను తీసుకొచ్చి వాళ్లను పర్పుల్ క్యాప్ రేసులో నిలిపాడు మహీ. తుషార్ దేశ్‌పాండే (21) టాప్ వికెట్ టేకర్ లిస్ట్‌లో నాలుగులో స్థానంలో నిలిచాడు. లంకకు చెందిన ఈ యువ పేసర్ మహేశ్ పతిరన(17).. కీలక సమయంలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పాడు. మహీశ్ తీక్షణ(11) వికెట్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేశాడు. ఇక సీనియర్లలో జడేజా(19), దీపక్ చాహర్(12) కూడా రాణించారు.
రహానె ఊహించని ప్రదర్శన.. గతంలో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు లాంటి వాళ్లను క్రీజులోకి తీసుకొచ్చి.. మంచి ఫలితం సాధించాడు ధోనీ. ఈ సారి రహానెకు అవకాశం ఇచ్చాడు. టెస్టు ప్లేయర్‌గా ముద్ర పడ్డ రహానె.. ఊహించని రీతిలో ప్రదర్శన చేశాడు. 170 స్ట్రైక్ రేట్‌తో 299 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. 14 సిక్సర్లు ఉన్నాయి.
మొయిన్ అలీ, అంబటి రాయుడు.. ఏ నాయకుడైనా జట్టు మీద నమ్మకం ఉంచడం మొదటి లక్షణం. ధోనీ మొదటి నుంచి నమ్మే సిద్ధాంతమిది. ఒక్క మ్యాచ్‌లో ఎవరైన సరైన ప్రదర్శన చేయలేకపోతే పక్కన పెట్టడం వంటివి ధోనీ చేయడు. ఈ సీజన్‌లోనూ మహీ.. తన జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా.. కేవలం ఆటతీరులో మార్పులు చేయించి విజయాలను అందుకున్నాడు. మొయిన్ అలీ, అంబటి రాయుడు లాంటివాళ్లు.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కానీ మహీ వాళ్లను బ్యాక్ చేశాడు. అందుకే క్వాలిఫయర్ 1లో కీలక సమయంలో వారు వేగంగా ఆడి పరుగులు సాధించారు.
-
Much #Yellove to this Super fam.!
— Chennai Super Kings (@ChennaiIPL) May 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
#PrideOf2023 #WhistlePodu 🦁💛 pic.twitter.com/yFm3lwVExi
">Much #Yellove to this Super fam.!
— Chennai Super Kings (@ChennaiIPL) May 24, 2023
#PrideOf2023 #WhistlePodu 🦁💛 pic.twitter.com/yFm3lwVExiMuch #Yellove to this Super fam.!
— Chennai Super Kings (@ChennaiIPL) May 24, 2023
#PrideOf2023 #WhistlePodu 🦁💛 pic.twitter.com/yFm3lwVExi
ఫీల్డింగ్‌లో మార్పు.. మహీ కీపింగ్‌లో ఎంత అలర్ట్‌గా ఉంటాడో .. జట్టు మొత్తం అలానే ఉండేలా చూసుకుంటుంటాడు. ఒక్కోసారి ఫీల్డర్ల ప్లేస్‌లను మారుస్తుంటాడు. రెండు అడుగులు అటు.. మూడు అడుగులు ఇటు అంటూ వారి కదలికలను చేంజ్ చేస్తుంటాడు. ఆ మార్పులు కూడా మంచి ఫలితాలను ఇస్తుంటాయి. ఇటీవలే జరిగిన గుజరాత్ మ్యాచ్‌లోనూ ఇలాంటి మార్పులే వికెట్లు తీశాయి.
కామ్‌గా ఉండటం.. మైదానంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైన కూల్ అండ్ కామ్‌గా వ్యవహరిస్తుంటాడు ధోనీ. ఎ్పప్పుడో ఓ సారి సీరియస్‌గా కనిపిస్తుంటాడు. అయితే ఈ సారి ఆ అలవాటును తన టీమ్‌కు కూడా బాగా నేర్పించాడు. క్వాలిఫయర్ 1లో.. ఫీల్డింగ్‌లో సేనాపతి తడబడుతుంటే.. కూల్‌గా ఉండమని చెప్పాడు. ఆ తర్వాత అతడు అంతే కూల్‌గా దర్శన్ నల్కాండేను రనౌట్ చేశాడు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి సంఘటనలు ఈ సీజన్‌లో చాలానే ఉన్నాయి.
ఇదీ చూడండి: ధోనీపై నిషేధం?.. ఫైనల్ మ్యాచ్‌కు అనుమానమే! ఆ పని చేయడం వల్లే ఇలా..