ETV Bharat / sports

రోహిత్ తను 'హిట్​మ్యాన్' అని గుర్తుపెట్టుకోవాలి: సెహ్వాగ్​

Rohit Sharma: కెప్టెన్సీ బాధ్యతలు తన బ్యాటింగ్​ను ప్రభావితం చేయకుండా చూసుకోవాలని ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్ శర్మకు సూచించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. బ్యాటింగ్​కు దిగినప్పుడు తను కెప్టెన్ అనే విషయం మరచిపోయి 'హిట్​మ్యాన్​' అని గుర్తుపెట్టుకోవాలని అన్నాడు.

Rohit Sharma
IPL 2022
author img

By

Published : Apr 13, 2022, 4:36 PM IST

Rohit Sharma: పంజాబ్ కింగ్స్​తో బుధవారం కీలక మ్యాచ్​ సందర్భంగా ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్ శర్మ బ్యాట్​ ఝుళిపించాలని అన్నాడు టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ సీజన్​లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్​ల్లోనూ ముంబయి ఓటమిపాలైంది. బౌలింగ్​ వైఫల్యాలు బయటపడ్డాయి. ఐదు సార్లు ఛాంపియన్​గా నిలిచిన ఆ జట్టు వికెట్ల కోసం జస్​ప్రీత్ బుమ్రాపై అధికంగా ఆధారపడుతోందని సెహ్వాగ్ ఇటీవలే ఓ క్రీడా ఛానెల్​తో అన్నాడు.

IPL 2022
బుమ్రా

"టాస్ ఓడిపోతే చెన్నై లాగే ముంబయి కూడా తమ బౌలర్ల కోసం అదనపు పరుగులు చేయాలి. తమ బౌలింగ్​ బలానికి 160-170 పరుగులు ఏమాత్రం సరిపోవు. బుమ్రా ఒక్కడే అంతా చేయాలంటే కష్టం. రోహిత్.. బ్యాటింగ్​కు దిగినప్పుడు కెప్టెన్ అనే విషయం మరిచిపోవాలి. తను హిట్​మ్యాన్​ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి."

-వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్

ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్​ల్లో 80 పరుగులు మాత్రమే చేశాడు రోహిత్. ఇక డెత్​ ఓవర్ల వరకు కనీసం ముగ్గురు బ్యాటర్లు ఉండేలా చూసుకోవాలని ముంబయికి సూచించాడు భారత మాజీ పేసర్ ఆర్​పీ సింగ్. గత మ్యాచ్​లో సూర్యకుమార్​ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడని, మిగిలిన బ్యాటర్లు కూడా కాస్త బాధ్యత తీసుకోవాలని అన్నాడు.

ఇవీ చూడండి:

పంజాబ్​ను నిలువరించి ముంబయి బోణీ కొట్టేనా?

IPL 2022: చెన్నై బోణీ.. బెంగళూరును ముంచేసిన మహీశ్ తీక్షణ

'క్రెడిట్​ మొత్తం ధోనీకేనా.. మిగతా ప్లేయర్స్​​ లస్సీ తాగేందుకు వెళ్లారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.