ETV Bharat / sports

రోహిత్ శర్మ చెత్త రికార్డు.. ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్

Rohit Sharma IPL Ducks : స్టార్​ క్రికెటర్​ రోహిత్ శర్మ ఐపీఎల్​లో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ చరిత్రలో అత్యధికంగా డకౌట్​ అయిన ప్లేయర్​గా రికార్డు నమోదు చేశాడు. దీంతోపాటు మరో చెత్త రికార్డు చేశాడు. అదేంటంటే..

Rohit Sharma IPL Ducks
Rohit Sharma IPL Ducks
author img

By

Published : May 6, 2023, 5:48 PM IST

Updated : May 6, 2023, 6:11 PM IST

Rohit Sharma IPL Ducks : ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ జట్టు సారథి రోహిత్​ శర్మ.. ఐపీఎల్​ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్​లో డకౌట్​ అయిన రోహిత్​.. ఐపీఎల్​ మొత్తం 16 సార్లు ఇలా ఔట్​ అయ్యాడు. దీంతోపాటు అత్యధిక సార్లు డకౌట్​ అయిన కెప్టెన్ (11)​గా రికార్డు మూడగట్టుకున్నాడు. దీంతో అత్యధికంగా డకౌట్​ అయిన ప్లేయర్లలో మొదటి స్థానంలో నిలిచాడు. అత్యధికంగా డకౌట్​ అయిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తర్వాత స్థానాల్లో.. సునీల్‌ నరైన్‌ (15), మన్‌దీప్‌ సింగ్‌ (15), దినేశ్‌ కార్తీక్‌ (15), అంబటి రాయుడు (14) ఉన్నారు.

4 మ్యాచ్​ల్లో 5 పరుగులు..​
అంతకుముందు జరిగిన మ్యాచ్​ల్లో.. ఏ ఒక్క మ్యాచ్​లోనూ 10కి పైన పరుగులు చేయలేదు. పైగా నాలుగు మ్యాచ్​ల్లో కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్​లో సున్నా పరుగులకే పెవిలియన్​ చేరాడు. అంతకుముందు మే 3న పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక, ఏప్రిల్​ 30న రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో కేవలం మూడు పరుగులు చేసి ఔట్​ అయ్యాడు. దానికి ముందు ఏప్రిల్​ 25న పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 2 పరుగులకే చేతులెత్తేశాడు. ఇలా వరుసగా విఫలమవుతున్న రోహిత్​పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అతడు ఫామ్​పైనా అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్​లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్​.. స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరగులు చేసింది. చెన్నై సూపర్​ కింగ్స్​కు 140 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, మొదటి నుంచి ముంబయి తడబడింది. ఓపెనర్లు కామెరూన్ గ్రీన్​ (6), ఇషాన్​ కిషన్ (7) పేలవ ప్రదర్శన చేశారు. ఆ తర్వాత వచ్చిన రోహిత్​ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి దిగిన నేహల్​ వధేరా (64) జట్టును కాపాడాడు. 8 ఫోర్లు ఒక సిక్స్​తో చెలరేగిపోయాడు. అతడు ఔట్​ అయిన తర్వాత సూర్య కుమార్​ (26), స్టబ్స్​ (20) ఫర్వాలేదనిపించారు. టిమ్​ డేవిడ్​ (2), అర్షద్​ ఖాన్ (1) జోఫ్రా ఆర్చర్​ (3*), చావ్లా (2*) పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక, చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ (3) వికెట్లతో చెలరేగిపోయాడు. చాహర్, తుశార్​ రెండు చొప్పున వికెట్లు తీశారు. జడేజా ఒక వికెట్​ పడగొట్టాడు. ​

Last Updated : May 6, 2023, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.