ETV Bharat / sports

రోహిత్​ చెత్త రికార్డు.. ఇక సూర్యను ఆపడం కష్టమే.. ఆర్సీబీకి అచ్చిరాని మూడో స్థానం! - surya kumar yadav innings rcb match

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో సూర్య (83; 35 బంతుల్లో 7×4, 6×6) వీరవిహారం చేశాడు. అయితే ఈ మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇకపోతే ఈ సీజన్​లో ఆర్సీబీకి మూడు స్థానం బ్యాటింగ్​ కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. ఆ వివరాలు..

Rohith sharma
రోహిత్​ చెత్త రికార్డు.. ఇక సూర్యను ఆపడం కష్టమే.. ఆర్సీబీకి అచ్చిరాని మూడో స్థానం
author img

By

Published : May 10, 2023, 7:45 AM IST

ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫస్టాఫ్​లో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పెద్దగా మెరవలేదు. వరుస డకౌట్లతో ఇబ్బంది పడ్డాడు. అయితే సెకండాఫ్​లో కాస్త గాడిన పడిన అతడు తాజాగా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన హిట్టింగ్​తో 'స్కై' అని మరోసారి నిరూపించాడు. దీంతో అతడు ఫామ్‌లోకి వచ్చాడంటే ఆపడం కష్టమని అర్థమవుతుంది. 200 పరుగుల భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నప్పటికీ కనిపిస్తున్నా సూర్య అస్సలు ఏమాత్రం బెదరలేదు. తన బ్యాటుతో బంతిని బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 26 బంతుల్లో 50 మార్క్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత 9 బంతుల్లో 33 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అలా మొత్తంగా 35 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్య తన తర్వాతి మ్యాచుల్లో ఇలానే తన విధ్వంసాన్ని కొనసాగిస్తే.. ముంబయి ఇండియన్స్‌ను ఆపడం కష్టమనే చెప్పాలి. ఇకపోతే ఆర్సీబీపై భారీ విజయంతో నెట్‌ రన్‌రేట్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్న ముంబయి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో టాప్‌-4లోకి రావడం ముంబయికి ఇదే ఫస్ట్​ టైమ్​. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ఇది మూడో విజయం. ఈ మ్యాచ్​లో ఓడిన రాయల్‌ ఛాలెంజర్స్‌.. తన ఆరో పరాజయంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను కష్టతరం చేసుకుంది.

రోహిత్ చెత్త రికార్డు.. ఈ సీజన్​లో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో హిట్​మ్యాన్​ 8 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి హసరంగా బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్​ చేరాడు. ఈ క్రమంలోనే అతడు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్​లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అవడం హిట్​మ్యాన్​కు ఇదే ఫస్ట్​టైమ్​. ఈ సీజన్‌లో రోహిత్‌ గత ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 2,3,0,0,7 పరుగులు మాత్రమే చేశాడు. గతంలో 2017 ఐపీఎల్‌ సీజన్​లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకు పరిమితమయ్యాడు రోహిత్​. తాజాగా తన చెత్త రికార్డును తానే అధిగమించాడు. ఇప్పుటివరకు ఈ సీజన్‌లో 11 మ్యాచులు ఆడిన రోహిత్​.. 191 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదాడు.

అచ్చిరాని మూడో స్థానం.. ఈ సీజన్​లో మూడో స్థానం బ్యాటింగ్‌ రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు అచ్చి రావడం లేదనే చెప్పాలి. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆర్సీబీ ప్లేయర్స్​ డకౌట్‌ లేదా పది పరుగుల లోపే ఔట్​ అయిపోతున్నారు. ఇప్పటివరకు బెంగళూరు తాజా సీజన్‌లో పది మ్యాచ్‌లు ఆడింది. అయితే ఇందులో వరుసగా ఏడుసార్లు మూడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన ప్లేయర్స్​ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్‌ రెండుసార్లు సున్న పరుగులకు ఔట్‌ అవ్వగా, మహిపాల్‌ లామ్రోర్‌ కూడా డకౌట్‌గానే వెనుదిరిగాడు. ఇక షాబాజ్‌ అహ్మద్‌ రెండుసార్లు రెండు పరుగులు మాత్రమే చేసి ఔట్​ అవ్వగా.. అనూజ్‌ రావత్‌ 9,6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అంతకముందు ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున మూడో స్థానంలో కోహ్లీ ఎక్కువగా బరిలోకి దిగేవాడు. అయితే కొంతకాలంగా విరాట్​ ఓపెనర్‌గా వస్తుండటం వల్ల.. మూడో స్థానంలో వేరే బ్యాటర్లు వస్తున్నారు. వచ్చీ రాగానే ఫెయిల్​ అవుతున్నారు. ఇది చూసిన కొంతమంది అభిమానులు, నెటిజన్లు సరదాగా 'మూడో స్థానం బ్యాటింగ్‌ లేపేద్దామా' అంటూ సరదాగా కామెంట్స్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి: IPL Cheerleaders Salary : ఐపీఎల్​లో ఛీర్​లీడర్స్​ శాలరీ ఎంత ఉంటుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.