ETV Bharat / sports

IPL 2021 news: చెన్నై-బెంగళూరు పోరు.. ఫ్యాన్స్​లో జోరు! - విరాట్ కోహ్లీ

దక్షిణాది ఫేవరేట్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(csk vs rcb 2021) అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2021(ipl 2021 live) రెండో దశలో భాగంగా నేడు (సెప్టెంబర్ 24) ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలపై ఓ లుక్కేద్దాం.

IPL 202
ఐపీఎల్
author img

By

Published : Sep 24, 2021, 5:32 AM IST

ఐపీఎల్ 2021(ipl 2021 live) రెండో దశలో భాగంగా నేడు(సెప్టెంబర్ 24) చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(csk vs rcb 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. సెకండ్ ఫేజ్​ తొలి మ్యాచ్​(rcb vs kkr 2021)ను ఓటమితో ప్రారంభించిన కోహ్లీసేన ఈ మ్యాచ్​లో ఎలాగైన గెలవాలన్న పట్టుదలతో ఉంది. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో కేవలం 92 పరుగులకే ఆలౌటైన ఈ జట్టు చెన్నైపై భారీ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు పటిష్ట ముంబయి జట్టు(mi vs csk 2021)పై అద్భుత విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్​లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లాలని భావిస్తోంది. మరి ఈ రెండు జట్లలో విజయమెవరిదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఈ మ్యాచ్(csk vs rcb 2021) రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.

కోహ్లీసేన గట్టెక్కేనా..!

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే బ్యాటింగ్​ విభాగంలో ఆర్సీబీ గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్ (217), విరాట్ కోహ్లీ (203) జట్టుకు అవసరమైన పరుగులు సాధించడంలో కృషి చేస్తే మిడిలార్డర్​పై ఒత్తిడి తగ్గే వీలుంది. ముఖ్యంగా కోల్​కతా(rcb vs kkr 2021)తో జరిగిన మ్యాచ్​లో టాపార్డర్​తో పాటు మిడిలార్డర్ కూడా దారుణంగా విఫలమైంది (పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). సీఎస్కేతో మ్యాచ్​లో ఓపెనర్లతో పాటు మ్యాక్స్​వెల్ (233), డివిలియర్స్ (207) బ్యాట్​కు పని చెప్పాలని అభిమానులు భావిస్తున్నారు. బౌలింగ్​ విభాగంలోనూ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్​లో సిరాజ్, హర్షల్ పటేల్ పర్వాలేదనిపించారు. జేమీసన్, చాహల్, హసరంగ ఓవర్​కు 10కిపైగా పరుగులు సమర్పించుకున్నారు. పటిష్ట ధోనీసేనపై గెలవాలంటే బౌలింగ్ విభాగం సమష్టిగా రాణించాల్సి ఉంటుంది.

సీఎస్కే జోరు

ముంబయితో జరిగిన మ్యాచ్(mi vs csk 2021)​లో ఆల్​రౌండ్ ప్రదర్శన కనబర్చింది చెన్నై(పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ముఖ్యంగా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 58 బంతుల్లో 88 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ జట్టు తరఫున సీజన్​లో టాప్ స్కోరర్​గా ఉన్న డుప్లెసిస్ (320), మొయిన్ అలీ డకౌట్​గా వెనుదిరగడం జట్టుకు రుచించడం లేదు. మరో సీనియర్ బ్యాట్స్​మన్ రాయుడు రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరగగా రైనా, ధోనీ బ్యాటింగ్​లో విఫలమయ్యారు. దీంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు గైక్వాడ్. జడేజా, బ్రావోలతో కలిసి ఇతడు జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అయితే సీఎస్కే ఈ మ్యాచ్​లోనైనా బ్యాటింగ్​లో ఓ ఆటగాడిపైనే భారం వేయకుండా సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. బౌలర్లు దీపక్ చాహర్, బ్రావోలు గత మ్యాచ్​లో ఆకట్టుకున్నారు. వీరితో పాటు చివరి మ్యాచ్​కు దూరమైన ఆల్​రౌండర్ సామ్ కరన్​ ఈ మ్యాచ్​లో ఆడే అవకాశం ఉంది.

జట్లు (అంచనా)

ఆర్సీబీ

కోహ్లీ (కెప్టెన్), పడిక్కల్, కేఎస్ భరత్, మ్యాక్స్​వెల్, డివిలియర్స్, సచిన్ బేబీ, హసరంగ, జేమీసన్, హర్షల్ పటేల్, సిరాజ్, చాహల్

సీఎస్కే

గైక్వాడ్, డుప్లెసిస్, మొయిన్ అలీ, రైనా, రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కరన్/హెజిల్​వుడ్, ధోనీ (కెప్టెన్), బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్

ఇవీ చూడండి: సోదరులతో పనిచేస్తున్నట్లే: ఐపీఎల్​పై నవనీత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.