IPL 2023 GT VS PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని అందుకుంది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ధావన్ సేన ఓటమి పాలైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(67) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఛేదనలో శుభ్‌మన్ గిల్ ఆటే హైలైట్ అని చెప్పాలి. పంజాబ్ బౌలర్లూ ఎంత కట్టుదిట్టంగా బంతులు సంధించినా.. ఒత్తిడిని తీసుకొస్తున్నా.. గిల్ మాత్రం వాటిని తట్టుకుని క్రీజులో నిలబడ్డాడు.
అయితే గుజరాత్ టైటాన్స్ విజయానికి చివరి ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా.. ధావన్.. సామ్ కరన్ చేతికి బంతిని ఇచ్చాడు. ఫస్ట్ బాల్‌కు మిల్లర్ సింగిల్ తీసి గిల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత కరన్ వేసిన అద్భుతమైన బౌలింగ్‌కు గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక్క సారిగా పంజాబ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలిపోయారు. పంజాబ్ డగౌట్ కూడా మొత్తం ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న పంజాబ్ కో ఓనర్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రీతి జింటా అనందానికి అవధులు లేకుండా పోయాయి.
గిల్ ఔట్ అయిన వెంటనే ప్రీతి జింటా.. బాలీవుడ్ యాక్టర్స్ అర్బాజ్ ఖాన్, సోనూ సూద్‌లతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంది. లేచి నిలబడి చప్పట్లు కొడుతూ తమ జట్టును ఎంకరేజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. ఇందులో ప్రీతి రియాక్షన్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఆమె ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు. ఆ తర్వాత రెండు బంతులు రెండు పరుగులు రాగా, తీవ్ర ఒత్తిడిలో ఐదో బంతిని తెవాటియా.. స్కూప్ షాట్‌తో ఫైన్ లెగ్ బౌండరీకి తరలించి పంజాబ్‌కు ఓటమి బాధను ఇచ్చాడు. అలా విజయం గుజరాత్ సొంతమైంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. వాస్తవానికి లక్ష్యం ఏమీ పెద్దది కాదు. కానీ రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది. ఫస్ట్ పంజాబ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులే చేసింది. మాథ్యూ షార్ట్ (36; 24 బంతుల్లో 6×4, 1×6) టాప్ స్కోరర్. మోహిత్ శర్మ (2/18), రషీద్ ఖాన్ (1/26), అల్జారి జోసెఫ్ (1/32), జోష్ లిటిల్ (1/31) పంజాబ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఇక ఛేదనలో గుజరాత్ కూడా కష్టపడింది. శుభ్‌మన్ గిల్(67; 49 బంతుల్లో 7×4, 1×6) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివరికి ఆ జట్టు లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేదించింది. చివర్లో గిల్ ఔట్ అయిన నేపథ్యంలో వచ్చిన రాహుల్ తెవాతియా (5*) ఒత్తిడిలో అద్భుత షాట్ ఆడి లక్ష్యాన్ని పూర్తి చేశాడు.
-
#TATAIPL2023#PBKSvsGT #SamKaran #RahulTewatia #Miller #SumanGill #PreityZinta #SonuSud pic.twitter.com/hdqpIjVkPB
— सुर्गीव विश्वकर्मा (@Sugreev96733097) April 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TATAIPL2023#PBKSvsGT #SamKaran #RahulTewatia #Miller #SumanGill #PreityZinta #SonuSud pic.twitter.com/hdqpIjVkPB
— सुर्गीव विश्वकर्मा (@Sugreev96733097) April 13, 2023#TATAIPL2023#PBKSvsGT #SamKaran #RahulTewatia #Miller #SumanGill #PreityZinta #SonuSud pic.twitter.com/hdqpIjVkPB
— सुर्गीव विश्वकर्मा (@Sugreev96733097) April 13, 2023
-
A last-over finish yet AGAIN! 👌 👌
— IndianPremierLeague (@IPL) April 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
It's the @gujarat_titans who hold their nerve against the spirited @PunjabKingsIPL ! 👏👏
Scorecard ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jYOqN5GBtK
">A last-over finish yet AGAIN! 👌 👌
— IndianPremierLeague (@IPL) April 13, 2023
It's the @gujarat_titans who hold their nerve against the spirited @PunjabKingsIPL ! 👏👏
Scorecard ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jYOqN5GBtKA last-over finish yet AGAIN! 👌 👌
— IndianPremierLeague (@IPL) April 13, 2023
It's the @gujarat_titans who hold their nerve against the spirited @PunjabKingsIPL ! 👏👏
Scorecard ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jYOqN5GBtK
ఇదీ చూడండి: IPL 2023: గుజరాత్-పంజాబ్ మ్యాచ్.. ఉత్కంఠభరిత క్లైమాక్స్.. హైలైట్ ఫొటోస్ మీకోసం..