ETV Bharat / sports

'ప్లీజ్ ధోనీ.. ఇప్పుడే రిటైర్​ అవ్వొద్దు.. ఇంకొన్నాళ్లు ఆడండి'.. మహీకి పైలట్​ రిక్వెస్ట్ - ఐపీఎల్​కు ధోనీ రిటైర్మెంట్​

ఐపీఎల్​కు కూడా చెన్నై జట్టు కెప్టెన్​ ధోనీ రిటైర్మెంట్​ ప్రకటిస్తారన్న వార్తలు వస్తున్న వేళ.. ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ పైలట్​.. ధోనీని రిటైర్మెంట్​ ప్రకటించవద్దని రిక్వెస్ట్​ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ms dhoni
ms dhoni
author img

By

Published : Apr 7, 2023, 5:14 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన ఆటతీరుకు ఫిదా అయిన అభిమానులు అతడిని ముద్దుగా మిస్టర్​ కూల్​ అని, తలైవా అని పిలుచుకుంటుంటారు. అన్నీ ఫార్మాట్లలోనూ అదరగొట్టే ఈ ప్లేయర్​ ఐపీఎల్​లో తనదైన శైలిలో అదరగొడతాడు. గత కొన్నేళ్లుగా సీఎస్​కే టీమ్​కు సారథిగా వ్యవహరిస్తూ ఎన్నో కీలక మ్యాచ్​ల్లో గెలిపించి నాలుగు సార్లు జట్టుకు కప్​ను అందించాడు. అయితే 2008 నుంచి సీఎస్​కే టీమ్​కు కెప్టెన్​గా ఉన్న ధోనీ.. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్​ రిటైర్మెంట్​ను ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న మహీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన స్టార్​ను ఇక ఎల్లో జెర్సీలో చూడలేం అంటూ బాధపడుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా రిటైర్మెంట్​ చేయొద్దంటూ కోరుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ అభిమాని.. ధోనీ రిటైర్​ అవ్వద్దంటూ స్వయంగా అతడినే కోరాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?
ఏప్రిల్ 8న ముంబయి ఇండియన్స్​తో మ్యాచ్ ఆడేందుకు సీఎస్​కే టీమ్​ చెన్నై నుంచి ముంబయికి పయనమౌతోంది. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో ఫ్లైట్​ ఎక్కింది టీమ్​. అయితే ఈ విషయం తెలుసుకున్న పైలట్​ విమానం టేకాఫ్ అయ్యే ముందు ఓ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. అలా ధోనీతో ఆ పైలట్​ మాట్లాడాడు. "ఎంఎస్ ధోనీ.. నేను మీకు చాలా పెద్ద అభిమానిని. దయచేసి ఇంకొంత కాలం సీఎస్​కేకు కెప్టెన్​గా కొనసాగండి. ఈ సారి మాత్రం మీరు రిటైర్మెంట్ ప్రకటించొద్దు" అంటూ కోరాడు. పైలట్​ మాటలు విన్న ప్యాసెంజర్స్​ ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.

అయితే ఇదే తన చివరి సీజన్​ అని ధోనీ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అంతే కాక రిటైర్మెంట్​ రూమర్స్​పై ఎప్పుడూ స్పందించలేదు. మరోవైపు సీఎస్​కే ప్లేయర్స్​ కూడా ఈ విషయంపై ఇటీవలే స్పందించారు. "అలాంటిదేమీ లేదు.. ధోనీ ఫిట్​గా ఉన్నాడు. మరో రెండు మూడేళ్లు పాటు ఆడతాడు" అని తెలిపారు.

ఇటీవలే సొంత గడ్డపై లఖ్​న​వూతో జరిగిన మ్యాచ్​లో గెలిచి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని సాధించింది చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్​. అయితే ఆ మ్యాచ్​ అంత ఈజీగా గెలవలేదు. 13 వైడ్లు, 3 నోబాల్స్‌ వేసి అదనపు పరుగులు ఇచ్చిన బౌలర్ల వల్ల విజయం కోసం సీఎస్కే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అయిపోయాక బౌలర్ల ప్రదర్శనపై ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలర్లు తమ ఆట శైలిని మార్చుకోకపోతే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని స్వీట్​ వార్నింగ్​ కూడా ఇచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.