ETV Bharat / sports

IPL 2023 KKR VS LSG : ప్లేఆఫ్స్​కు చేరిన లఖ్​నవూ.. ఒక్క పరుగు తేడాతో విజయాన్ని..

IPL 2023 KKR VS LSG Playoffs : ప్లే ఆఫ్స్​కు చేరేందుకు జరిగిన పోరులో లఖ్​నవూదే పై చేయిగా నిలిచింది. శనివారం కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో రాహుల్​ సేన.. ఒక్క పరుగు తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

Kolkata Knight Riders vs Lucknow Super Giants

author img

By

Published : May 20, 2023, 10:59 PM IST

Updated : May 21, 2023, 6:34 AM IST

IPL 2023 KKR VS LSG Playoffs : ఐపీఎల్ 2023లో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​-కోల్​కతా నైట్​ రైడర్స్​ తలపడ్డా. ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (28; 27 బంతుల్లో), ప్రేరక్ మన్కడ్ (26; 20 బంతుల్లో), ఆయుష్‌ బదోని (25; 21 బంతుల్లో) ఫర్వాలేదనిపించగా.. చివర్లో వచ్చిన నికోలస్ పూరన్ (58; 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్​ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్, వైభవ్‌ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.

అనంతరం 177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్​.. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. జాసన్​ రాయ్​(45), వెంకటేశ్ అయ్యర్​(24), నితీశ్ రానా(8), రెహ్మానుల్లా గుర్బాజ్​(10), ఆండ్రూ రసెల్​(7) పరుగులు చేశారు. లఖ్​నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్​ రెండు వికెట్లు పడగొట్టగా.. కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్​, యశ్​ థాకూర్​ తలో వికెట్​ తీశారు.

73/5. 10.1 ఓవర్లలో లఖ్‌నవూ పరిస్థితి ఇది. ప్రేరక్‌ మన్కడ్‌, కరన్‌ శర్మ, డికాక్‌, స్టాయినిస్‌, కృనాల్‌ వరుసగా ఔటయ్యారు. 7 నుంచి 10 ఓవర్ల మధ్య లఖ్‌నవూకు కేవలం 19 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ జట్టు తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకునేలా కనిపించింది. కానీ చెలరేగి ఆడిన పూరన్‌ ఆ జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఇక పూరన్‌.. వస్తూనే బాదుడు మొదలెట్టాడు. ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్లోనే.. వరుణ్‌ వరుసగా 4, 4, 6 దంచేశాడు.

మరోవైపు బదోని అండగా నిలవగా.. పూరన్‌ ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడం వల్ల స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీంతో 18వ ఓవర్లో బదోని నిష్క్రమించేటప్పటికి స్కోరు 147. తర్వాతి ఓవర్లో పూరన్‌ రెండు సిక్స్‌లు కొట్టి పెవిలియన్​కు చేరుకున్నాడు. చివరి ఓవర్లో (రసెల్‌) ఆఖరి రెండు బంతుల్లో గౌతమ్‌ వరుసగా 6, 4 దంచేశాడు. పూరన్‌ జోరుతో చివరి పది ఓవర్లలో లఖ్‌నవూ 103 పరుగులను పిండుకుంది. అతడు బదోనితో ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించాడు.

ఇదీ చూడండి: CSK Playoffs : దటీజ్​ చెన్నై.. 14 సీజన్లలో 12 సార్లు.. జర్నీ సాగిందిలా..

Last Updated : May 21, 2023, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.