గురువారం ఆర్సీబీ-కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌కు చెందిన యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ.. మైదానంలో తన బంతితో చెలరేగిపోయాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఈ కుర్రాడు తన స్పిన్నింగ్ స్కిల్స్‌తో అదరగొట్టాడు. కేకేఆర్‌కు చెందిన వెంకటేశ్ శర్మకు బదులుగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సుయాశ్ తన బౌలింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను వేసిన నాలుగు ఓవర్లకు 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ ప్లేయర్ గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఇతను ఎవరంటే..
19 ఏళ్ల ఈ యంగ్ క్రికెటర్ దిల్లీలో జన్మించాడు. ఇప్పటివరకు ఏ దేశవాళీ జట్టుకు ఎంపిక కాని సుయాశ్..దిల్లీ అండర్-25 పురుషుల స్టేట్-ఎ ట్రోఫీలో మాత్రమే ఆడాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సుయాశ్ కేవలం 2వికెట్లు పడగొట్టాడు. దిల్లీ క్లబ్లో క్రికెట్ ఆడుతుండగా సుయాశ్ గురించి తెలిసిన కొల్కతా హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్, టీమ్ మేనేజ్మెంట్ వద్ద నుంచి వివరాలు సేకరించి అతన్ని మ్యాచ్‌కు రప్పించారు.
గతేడాది చివర్లో జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంతో సుయాశ్ శర్మను రూ.20లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే సుయాశ్ గురించి కేకేఆర్ క్యాంప్‌కు వెళ్లేవరకూ ఎవరికీ తెలియదట. కేకేఆర్‌తో ఆడిన మ్యాచే అతడికి తొలి ప్రొఫెషనల్ గేమ్ కావడం విశేషం.ఆడిన తొలి మ్యాచ్‌లోనే.. ఏ మాత్రం బెరకు లేకుండా బౌలింగ్ చేసి అదరగొట్టాడు. అతని బంతులను దినేష్ కార్తీక్ వంటి బౌలరే అర్థం చేసుకోలేకపోయాడంటే ఆ బౌలింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యవ ప్లేయర్‌పై ప్రశంసల వర్షం..
కోల్‌కతా నైట్ రైడర్స్ యువ స్పిన్నర్ సుయాశ్ శర్మపై దక్షిణాఫ్రికా దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. అతను తన బౌలింగ్‌తో ఆర్సీబీ ప్లేయర్లను చాలా ఇబ్బంది పెట్టాడని అన్నాడు. "సుయాశ్ గురించి గతంలో నాకు తెలియదు. కానీ, గురువారం జరిగిన మ్యాచ్‌లో అతడి బౌలింగ్ నన్ను చాలా ఆకట్టుకుంది. భవిష్యత్తులో కూడా అతడు ఒత్తిడికి గురయ్యే సమయం వస్తుంది. అప్పుడు దానిని అధిగమించి ఎలా రాణిస్తాడో చూడాలని ఉంది. ఆ మ్యాచ్‌లో సుయాశ్ నిజంగా మా ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెట్టాడు. మొదట్లో అయితే వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌ల వల్లే ఆర్సీబీకి ఎక్కువ నష్టం జరిగిందని అనుకున్నా. కానీ, ఈ విషయంలో ఎక్కువ క్రెడిట్ సుయాశ్‌కే దక్కుతుంది. ఇంతపెద్ద టోర్నమెంట్లో అనుభవం లేకపోయినా అతడు తన సత్తా ఏమిటో చూపించాడు" అంటూ సుయాశ్‌ను ఏబీడి కొనియాడాడు.
-
Anuj Rawat ☑️
— IndianPremierLeague (@IPL) April 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Dinesh Karthik ☑️
Watch Suyash Sharma pick two quick wickets in his debut game.
Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4
">Anuj Rawat ☑️
— IndianPremierLeague (@IPL) April 6, 2023
Dinesh Karthik ☑️
Watch Suyash Sharma pick two quick wickets in his debut game.
Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4Anuj Rawat ☑️
— IndianPremierLeague (@IPL) April 6, 2023
Dinesh Karthik ☑️
Watch Suyash Sharma pick two quick wickets in his debut game.
Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4