ETV Bharat / sports

తెవాతియా 'ప్రేమ'​ కోసం గిల్​​ త్యాగం​.. ఈ పంజాబ్​ లవ్​స్టోరీ ఏంటో తెలుసా? - రాహుల్​ తెవాతియా పంజాబ్​ లవ్​ స్టోరీ

గుజరాత్​ ప్లేయర్​ రాహుల్‌ తెవాతియాకు పంజాబ్‌ జట్టుతో ఉన్న లవ్‌స్టోరీ గురించి గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెవాతియా 'పంజాబ్​ లవ్​స్టోరీ' కోసం తాను ఓ త్యాగం చేసినట్లు చెప్పాడు. ఆ పంజాబ్​ లవ్​స్టోరీ ఏంటంటే..

ipl 2023 rahul tewatia punjab love story  shubman gill

author img

By

Published : Apr 14, 2023, 5:26 PM IST

Updated : Apr 14, 2023, 5:35 PM IST

గుజరాత్​ టైటాన్స్​ జట్టు స్టార్​ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు ప్లేయర్​ రాహుల్​ తెవాతియా ప్రేమ కోసం తాను ఓ త్యాగం చేశానని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఐపీఎల్​ 16వ సీజన్​లో భాగంగా గురువారం గుజరాత్‌, పంజాబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్​ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత ప్రదర్శతో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, చివరి ఓవర్‌ రెండో బంతికి పెవిలియన్‌ చేరడం వల్ల మ్యాచ్‌ను ముగించే బాధ్యతను రాహుల్‌ తెవాతియా తీసుకున్నాడు. 19వ ఓవర్‌ ఐదో బంతికి బౌండరీ బాది జట్టుకు విజయాన్నిందించాడు.

మ్యాచ్‌ అనంతరం రాహుల్​ తెవాతియా గురించి.. శుభ్​మన్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు ఇబ్బందికరంగా మారడం వల్ల చివరి ఓవర్లలో బౌండరీలు సాధించడం కష్టం అయిందని అన్నాడు. అయితే మ్యాచ్‌ను తానే ముగించాల్సిందని. కానీ.. రాహుల్​ తెవాతియాకు పంజాబ్‌ జట్టుతో ప్రత్యేక లవ్‌స్టోరీ ఉంది.. అందుకే అతడు మ్యాచ్‌ను ముగించాడని అని గిల్‌ సరదాగా అన్నాడు.

'ఇలాంటి పిచ్‌పై స్ట్రైక్‌ను రొటేట్‌ చేసుకుంటూ.. డాట్‌ బాల్స్‌ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. పంజాబ్‌ కింగ్స్​ ఇన్నింగ్స్‌ అయిపోగానే.. పవర్‌ప్లేలోనే ఎక్కువ పరుగులు రాబట్టాలని ప్లాన్​ చేశారు. అందుకు తగ్గట్టే రన్స్​ చేశాం. ఇక హార్దిక్‌ పాండ్య పెవీలియన్​ చేరడం వల్ల ఔటైన తర్వాత మేం కాస్త దూకుడును కోల్పోయాం. కానీ టార్కెట్​ చిన్నదే కావడం వల్ల స్ట్రైక్‌ రొటేట్‌ పైనే దృష్టి సారించాం' అని శుభ్​మన్​ గిల్‌ వివరించాడు. గుజరాత్​ తరఫున తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటిన మోహిత్‌ శర్మపై కూడా శుభమన్​ ప్రశంసించాడు. కాగా, మోహిత్‌ శర్మ పొదుపుగా బౌలింగ్‌ చేయడమే కాకుండా.. రెండు వికెట్లు కూడా ఖాతాలో వేసుకుని గుజరాత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తెవాతియా 'పంజాబ్‌ లవ్​స్టోరీ' ఇదే..
గత ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కింగ్​తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ తెవాతియా చివరి ఓవర్లో చెలరేగాడు. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరమైన సమయంలో.. రెండు సూపర్​ సిక్స్‌లు బాదాడు. దీంతో గుజరాత్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. దాన్ని దృష్టిలో ఉంచుకునే రాహుల్​ తెవాతియాకు పంజాబ్‌తో ప్రత్యేక లవ్‌స్టోరీ ఉందని శుభ్​మన్​ గిల్​ అన్నట్లు సమాచారం.

Last Updated : Apr 14, 2023, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.