IPL 2023 Final : చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి టైటిల్ నెగ్గుతుందని సీఎస్కే ఫ్యాన్స్ ఓ లాజిక్‌ను ఆధారంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. అలాగే సీఎస్కే సారథి ధోనీకి కూడా ఫైనల్ మ్యాచ్ జరగనున్న మే 28 వ తేదితో మంచి అనుబంధం ఉంది. ఇంతకీ అసలు సంగతేంటి అంటే..
IPL 2011 Final Csk vs Rcb : సరిగ్గా 12 ఏళ్ల కింద 2011 ఐపీఎల్‌లోనూ చెన్నై ఫైనల్ మ్యాచ్ ఆడింది. అప్పటి పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్‌లో ఉండగా.. చెన్నై రెండో స్థానంలో నిలిచింది. ఈ ఇరు జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్- 1లో సీఎస్కే గెలిచి నేరుగా ఫైనల్ చేరింది. క్వాలిఫయర్- 1లో ఓడిన ఆర్సీబీ, క్వాలిఫయర్- 2లో ముంబయి ఇండియన్స్‌ను చిత్తుచేసి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీని 147 స్కోరుకే పరిమితం చేసిన చెన్నై వరుసగా రెండో టైటిల్ నెగ్గి రికార్డు సృష్టించింది.
ఇక ప్రస్తుత ఐపీఎల్ చూస్తే దాదాపు అదే సినారియో రిపీట్ అయింది! ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనున్న గుజరాత్, చెన్నై జట్లు ఈ సీజన్లో టాప్ రెండు స్థానాల్లో నిలిచాయి. ఇందులో టేబుల్ టాపర్ గుజరాత్.. క్వాలిఫయర్- 1లో సీఎస్కే చేతిలో పరాజయం పాలైంది. దీంతో జీటీ .. క్వాలిఫయర్ - 2 ఆడాల్సి వచ్చింది. అప్పటిలాగే ఇప్పుడు కూడా లీగ్ టేబుల్ టాపర్ గుజరాత్, ముంబయి ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ - 2 మ్యాచ్ జరిగింది. టేబుల్ టాపర్ గెలిచి ఫైనల్‌కు వెళ్లగా.. ముంబయి ఇంటి బాట పట్టింది.
అయితే ఈ రెండు సీజన్ల మధ్య ఉన్న కామన్ పాయింట్.. అప్పుడు ఇప్పుడు చెన్నై టేబుల్లో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు సీజన్లలోను క్వాలిఫయర్- 1లో ఆడిన సీఎస్కే టేబుల్ టాపర్‌ను చిత్తుచేసింది. క్వాలిఫయర్ -1లో భంగపడ్డ అప్పటి ఆర్సీబీ, ఇప్పటి జీటీ ఈ రెండూ కూడా క్వాలిఫయర్ -2 లో ముంబయితోనే తలపడాల్సి రావటం గమనార్హం. 2011లో సక్సెస్‌ఫుల్‌గా ఆర్సీబీ ఫైనల్ చేరినా అదృష్టం వరించలేదు. అలాగే ఈ ప్రెడిక్షన్ ఆధారంగా చెన్నై గుజరాత్‌ను ఓడిస్తుందంటూ.. ఈ కో- ఇన్సిడెన్స్లు మళ్లీ జరుగవచ్చన్న ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ICC WC 2011 Seniment : ఇక మరోవైపు ఇంకో సెంటిమెంట్ కూడా సీఎస్కే ఫ్యాన్స్‌లో ఆశలు రేకెత్తిస్తోంది. 2011, 2023 సీజన్ల ఫైనల్ మ్యాచ్‌లు మే 28వ తేదినే ఉన్నాయి. కాగా ఈ రెండు సంవత్సరాల్లో ఐసీసీ నిర్వహిస్తున్న వన్డే ప్రపంచ కప్‌నకు భారత్ ఆతిధ్యమివ్వనుండటంతో చెన్నై ఫ్యాన్స్ 'అన్నీ మంచి శకునములే' అంటూ సోషల్ మీడియాలో సంబరాలు మొదలు పెట్టేశారు. ఇకపోతే అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. టైటిల్‌పై అటు చెన్నై ఇటు గుజరాత్ జట్లు కన్నేశాయి.
-
Every time you stepped on to the field, you gave us butterflies 🦋 pic.twitter.com/qMNXMR5IsS
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Every time you stepped on to the field, you gave us butterflies 🦋 pic.twitter.com/qMNXMR5IsS
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023Every time you stepped on to the field, you gave us butterflies 🦋 pic.twitter.com/qMNXMR5IsS
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023