IPL 2023 GT vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా గుజరాత్, లఖ్‌నవూ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గుజరాత్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ 56 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. లఖ్‌నవూ ఓపెనర్లు అధ్భుత ప్రదర్శన చేసినా.. గుజరాత్ భారీ టార్గెట్‌ను ఛేదించలేకపోయారు. కేల్ మేయర్స్ (48), క్వింటన్ డికాక్ (70) మెరిశారు. దీపక్ హుడా (11), ఆయుశ్ బదోని (21) ఓ తీరుగా ఆడగా.. మిగతా ప్లేయర్లందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇక, గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ (4) వికెట్లు తీసి చుక్కలు చూపించాడు. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. లఖ్‌నవూ బౌలర్లకు చుక్కులు చూపించింది. గుజరాత్ ఓపెనర్లు దంచికొట్టారు. వృద్ధిమాన్ సాహా (81)అద్భుత ప్రదర్శన చేశాడు. శుభ్‌మన్ (94*) తృటిలో శతకం మిస్ అయ్యాడు. హార్దిక్ పాండ్య (25), మిల్లర్ (21*) ఫర్వాలేదనిపంచారు. లఖ్‌నవూ బౌలర్లలో మోసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
టాప్‌లో టైటాన్స్..
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు.. 8 మ్యాచ్‌లు గెలిచింది. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో 13 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనసాగుతోంది. ఈ రెండు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ల్లో రెండిట్లో విజయం సాధించినా.. గుజారాత్ టాప్‌లోనే ఉంటుంది. అయితే, గుజరాత్ రెండింట్లో ఓడి.. చెన్నై మూడింట్లో విజయం సాధిస్తే.. సీఎస్కేనే టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. చూడాలి ఎవరు టేబుల్ టాపర్ అవుతారో.
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి..
ఈ మ్యాచ్ మరో అద్భుత ఘట్టానికి వేదికైంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య అన్నదమ్ములు తలపడ్డారు. ఇదివరకు అన్నదమ్ములు.. వేర్వేరు జట్లకు, ఒకే జట్టుకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కానీ, తొలిసారి ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లుగా ఉన్న సోదరులుగా హర్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య రికార్డు సృష్టించబోతున్నారు. అయితే, ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్య నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడం వల్ల.. కృనాల్ పాండ్య లఖ్‌నవూ జట్టు సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ అన్నదమ్ములు తలపడ్డారు. మ్యాచ్ ప్రారంభంలో హార్దిగ్.. తన కృనాల్ టోపీ సరిచేశాడు. అనంతరం ఇద్దరు హగ్ చేసుకున్నారు. ఈ అద్భుత దృశ్యం ప్రేక్షకులను ఆనందోత్సాహాలకు గురిచేసింది. అన్నదమ్ముల ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.
-
The love and bond between Hardik Pandya and Krunal Pandya - The Brothers.
— CricketMAN2 (@ImTanujSingh) May 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
What a beautiful video! pic.twitter.com/PKg3hsoooR
">The love and bond between Hardik Pandya and Krunal Pandya - The Brothers.
— CricketMAN2 (@ImTanujSingh) May 7, 2023
What a beautiful video! pic.twitter.com/PKg3hsoooRThe love and bond between Hardik Pandya and Krunal Pandya - The Brothers.
— CricketMAN2 (@ImTanujSingh) May 7, 2023
What a beautiful video! pic.twitter.com/PKg3hsoooR