ETV Bharat / sports

IPL 2023 : తడబడిన ముంబయి ఇండియన్స్​.. 13 ఏళ్ల తర్వాత చెన్నై విక్టరీ! - ఐపీఎల్​ చెన్నై వర్సెస్​ ముంబయి మ్యాచ్​ ఫలితం

IPL 2023 MI vs CSK : ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ 2023​లో భాగంగా ముంబయి, చెన్నై జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. చెన్నై ప్లేయర్​ డేవన్​ కాన్వే అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో చెన్నై సూపర్​ కింగ్స్​ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

mi vs cks result
mi vs cks result
author img

By

Published : May 6, 2023, 7:03 PM IST

Updated : May 6, 2023, 8:08 PM IST

IPL 2023 MI vs CSK : ఐపీఎల్​ 2023​లో భాగంగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్​ కింగ్స్​ జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. ముంబయి నిర్దేశించిన 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 6 వికెట్ల తేడాతో ముంబయిపై విజయం సాధించింది. 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఛేసింగ్​ పూర్తి చేసింది. మొదటి నుంచి చెన్నై జట్టు ఆధిపత్యం కనబర్చింది. ఓపెనర్లు రుతురాజ్​ గైక్వాడ్​ (30), డేవన్​ కాన్వే (44) అదరగొట్టారు. అంబటి రాయుడు (12) తడబడగా.. అజింక్య రహానే (21) ఫర్వాలేదనిపించాడు. శివమ్​ దుబే (26*), ధోనీ ( 2*)పరుగులు చేశాడు. ఇక, ముంబయి బౌలర్లలో పీయుశ్​ చావ్లా రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ మధ్వల్, స్టబ్స్ ఒక వికెట్​ పడగొట్టారు.

అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు​.. స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరగులు చేసింది. మొదటి నుంచి ముంబయి తడబడింది. ఓపెనర్లు కామెరూన్ గ్రీన్​ (6), ఇషాన్​ కిషన్ (7) పేలవ ప్రదర్శన చేశారు. ఆ తర్వాత వచ్చిన రోహిత్​ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి దిగిన నేహల్​ వధేరా (64) జట్టును కాపాడాడు. 8 ఫోర్లు ఒక సిక్స్​తో చెలరేగిపోయాడు. అతడు ఔట్​ అయిన తర్వాత సూర్య కుమార్​ యూదవ్ (26), స్టబ్స్​ (20) ఫర్వాలేదనిపించారు. టిమ్​ డేవిడ్​ (2), అర్షద్​ ఖాన్ (1) జోఫ్రా ఆర్చర్​ (3*), చావ్లా (2*) పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక, చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ (3) వికెట్లతో చెలరేగిపోయాడు. చాహర్, తుశార్ దేశ్​పాండే​ రెండు చొప్పున వికెట్లు తీశారు. జడేజా ఒక వికెట్​ పడగొట్టాడు. ​

13 ఏళ్ల తర్వాత ముంబయిపై విక్టరీ..
ఈ మ్యాచ్​ మరో అద్భుతమైన ఘట్టానికి వేదికైంది. 13 సంవత్సరాల తర్వాత తన సొంత గడ్డలో ముంబయిపై చెన్నై సూపర్​ కింగ్స్​ విజయం సాధించింది. చెపాక్​ స్టేడియం వేదికగా 2010లో ముంబయిపై చెన్నై విజయం సాధించింది. ఆ తర్వాత నుంచి హోమ్​ గ్రౌండ్​లో ముంబయి ఆధిపత్యం కనబర్చింది.

రోహిత్ చెత్త రికార్డు..
ఈ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్​ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు 16 సార్లు సున్నా పరుగులకే ఔట్​ అయి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్​ అయిన ప్లేయర్​గా రికార్డు నమోదు చేశాడు. దీంతో పాటు ఐపీఎల్​లో అత్యధిక సార్లు డకౌటైన కెప్టెన్​గా కూడా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానాల్లో 15 డకౌట్లతో సునీల్ నరైన్, మన్​దీప్​ సింగ్​, దినేశ్​ కార్తిక్​.. 14 డకౌట్లతో అంబటి రాయుడు ఉన్నారు. ​ఇంతే కాకుండా రోహిత్​​ ఫామ్​ కూడా ఆందోళనకరంగానే ఉంది. గత నాలుగు మ్యాచ్​ల్లో కలిపి కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.

Last Updated : May 6, 2023, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.