ETV Bharat / sports

DRS For Wides: 'వైడ్ల నిర్ణయంపైనా డీఆర్‌ఎస్‌కు అవకాశం!' - వైడ్ బాల్స్ డీఆర్ఎస్ వెటోరీ

DRS For Wides: క్రికెట్​లో వైడ్​లపై అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించేందుకు కూడా 'డీఆర్ఎస్' అవకాశం కల్పించాలని బెంగళూరు మాజీ సారథి వెటోరి సూచించాడు. చాలాసార్లు అంపైర్ల నిర్ణయాలు బౌలర్లకు వ్యతిరేకంగా వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు.

DRS For Wides
DRS For Wides
author img

By

Published : May 3, 2022, 4:25 PM IST

DRS For Wides: ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్‌లో అంపైర్ల నిర్ణయాలపై చర్చ కొనసాగుతూనే ఉంది. వైడ్లు, నోబాల్‌ వంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరు మాజీ కోచ్‌ డానియల్‌ వెటోరి 'వైడ్ల' అంశంపై స్పందించాడు. రాజస్థాన్‌, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదస్పదంగా మారిన వైడ్ల ప్రకటనతో సంజూ శాంసన్‌ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో క్లిష్టమైన వైడ్ల నిర్ణయాన్ని డీఆర్‌ఎస్‌ వినియోగించి తేల్చాలని బెంగళూరు మాజీ కెప్టెన్‌ డానియల్ వెటోరి సూచించాడు.

Daniel Vettori drs wides: "వైడ్స్‌ కోసం ఆటగాళ్లు రివ్యూకు వెళ్లేందుకు అనుమతినివ్వాలి. ఇటువంటి క్లిష్టమైన విషయాల్లో ఆటగాళ్లకు స్వేచ్ఛ ఉండాల్సిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. అయితే చాలాసార్లు అంపైర్ల నిర్ణయాలు బౌలర్లకు వ్యతిరేకంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైడ్ల విషయంలో కొన్ని తప్పులు జరిగాయని అనిపిస్తుంది. అందుకే వాటిని సరిదిద్దాలి. క్లిష్టమైన వైడ్ల నిర్ణయంపై డీఆర్‌ఎస్‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తే బాగుంటుంది" అని వెటోరి వివరించాడు.

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ వైడ్‌ ఇవ్వగానే అసహనానికి గురైన సంజూ శాంసన్‌ డీఆర్‌ఎస్‌ ఇవ్వాలని అడగటం నెట్టింట్లో వైరల్‌గా నిలిచింది. అలానే ఎల్బీడబ్ల్యూ అప్పీలుకు వెళ్లినప్పుడు నాటౌట్‌గా తేలినా సరే ఆ బంతిని డాట్‌గానే పరిగణించడం సరికాదని క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. కీలకమైన మ్యాచుల్లో ఫలితం ఆ ఒక్క బంతితోనే ఉంటే వివాదం మరింత ఎక్కువుతుందని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఓపెనింగ్‌లో చెన్నై రికార్డు.. ఇతర జట్లు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.