IPL 2022: ఐపీఎల్ 2022లో చెన్నై బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 193/9 కే పరిమితమైంది ఆర్సీబీ. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (8), అనూజ్ రావత్ (12), విరాట్ కోహ్లీ (1) సహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (26), షాబాజ్ అహ్మద్ (41), సుయష్ ప్రభుదేశాయ్ (34), దినేశ్ కార్తీక్(34) పోరాడే ప్రయత్నం చేశారు. మహమ్మద్ సిరాజ్(14), జోష్ హేజిల్‌వుడ్(7) నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో మహీశ్ తీక్షణ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. ముఖేశ్, బ్రావో తలో ఒక వికెట్ తీశారు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 216/4 పరుగులు చేసింది. 10 ఓవర్లకు 60 పరుగుల వద్ద ఉన్న స్థాయి నుంచి సిక్సర్లు, ఫోర్లతో మోతమోగించారు ఉతప్ప (50 బంతుల్లో 88), శివం దూబె (95). దీంతో బెంగళూరుకు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది చెన్నై. ఓపెనర్ రుతురాత్ గైక్వాడ్ (17) మరోసారి స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాడు. మొయిన్ అలీ (3) రనౌట్‌గా వెనుదిరిగాడు. బెంగళూరు బౌలర్లలో హసరంగ 2, జోష్ హేజిల్‌వుడ్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి: Virat Kohli: అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ