ETV Bharat / sports

ipl 2021: ఐపీఎల్ కొత్త జట్లు ఆ నగరాల నుంచే..!

ఐపీఎల్​లో కొత్త జట్లు (ipl new teams) అహ్మదాబాద్​, లక్నో నగరాల నుంచి రానున్నట్లు సమాచారం. అహ్మదాబాద్​ నుంచి అదానీ గ్రూప్స్​.. మాంచెస్టర్ యూనైటెడ్​ ప్రీమియర్ లీగ్ లక్నో తరపున వేలంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ipl 2022 latest news
ఐపీఎల్ బిడ్డింగ్
author img

By

Published : Oct 22, 2021, 1:45 PM IST

ఐపీఎల్ లీగ్​లో మరో రెండు కొత్త జట్లను(ipl new teams) రానున్నాయి. వాటి వేలాన్ని అక్టోబరు 25న నిర్వహించనుంది బీసీసీఐ. కొత్త టీమ్​లకు యజమానులు కావడానికి చాలా కంపెనీలు (ipl new teams names latest) ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త జట్లను దక్కించుకునేందుకు అహ్మదాబాద్​, లక్నోలు ముందువరుసలో ఉన్నాయని సమాచారం. అహ్మదాబాద్​ నుంచి అదానీ గ్రూప్ బిడ్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో సంస్థ మాంచెస్టర్ యూనైటెడ్​ ప్రీమియర్ లీగ్ లక్నో తరపున బిడ్డింగ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

వేలంలో పాల్గొనేందుకు అవసరమైన ఐటీటీ డాక్యుమెంట్​ (రూ.10 లక్షల విలువ)ను దాదాపు 20 పార్టీలు కొనుగోలు చేసినట్లు సమాచారం. జట్ల మొదటి ధరను రూ.2000 కోట్లుగా బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అన్నీ పార్టీలు వేలం జరగనున్న దుబాయ్​కి ఇప్పటికే చేరుకున్నాయి.

యూరప్​కు చెందిన ప్రముఖ ఫుట్​బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్, ఒడిశాకు చెందిన పవర్, స్టీల్, కోల్​ తయారీ సంస్థ, కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్(సీవీసీ), అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఐపీఎల్ కొత్త జట్లపై కన్నేశాయని తెలుస్తోంది. సీవీసీ ఇప్పటికే ఫార్ములావన్​ను సొంతం చేసుకుంది.

నవీన్​ జిందాల్..

జిందాల్ స్టీల్, పవర్ సంస్థ ఛైర్మన్​ నవీన్ జిందాల్ కూడా ఐపీఎల్ జట్టును కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. యూరప్​కు చెందిన ఫుట్​బాల్ టీమ్​తో బీసీసీఐ ఇప్పటికే చర్చలు జరిపింది. కానీ ఆ పేరును బయటపెట్టడానికి నిరాకరించింది. వీరితో పాటు కొటాక్ గ్రూప్​, టొరెంట్, అరబిందో, రెండు ఫార్మాస్యూటికల్స్​ సంస్థలు, అదానీ గ్రూప్​, సంజీవ్ గొయెంకా కూడా ఐపీఎల్​ ఫ్రాంచైజ్​కు పోటీ పడుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:వార్మప్ మ్యాచ్​లే టీమ్ఇండియాకు ప్రమాణం కాదు: యువరాజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.