ETV Bharat / sports

PBKS Vs RR: పంజాబ్​ ఓటమికి కారణం అతడే! - Punjab Kings vs Rajasthan Royals

పంజాబ్‌ లక్ష్యం 186. 19 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 182/2. క్రీజులో విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ పూరన్‌, మార్‌క్రమ్‌. అప్పటికి వాళ్లు మంచి ఊపులో ఉన్నారు కూడా. చివరి ఓవర్లో పంజాబ్‌ చేయాల్సింది 4 పరుగులే. ఆ జట్టు డగౌట్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. అందరిలో విజయం తమదేనన్న ధీమా. కార్తీక్‌ త్యాగి బంతినందుకున్నాడు. తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి సింగిల్‌. మూడో బంతికి పూరన్‌ ఔట్‌. కాస్త ఉత్కంఠ రేగినా 3 బంతుల్లో చేయాల్సింది 3 పరుగులే కాబట్టి పంజాబ్‌ గెలుపు కష్టమేం కాదన్న అంచనా. కానీ నాలుగో బంతికి పరుగు రాలేదు. ఉత్కంఠ పెరిగిపోయింది. అయిదో బంతికి వికెట్‌. వాతావరణం  వేడెక్కిపోయింది. సంచలన బౌలింగ్‌ను కొనసాగిస్తూ కార్తీక్‌.. చివరి బంతికీ పరుగివ్వలేదు. పంజాబ్‌ ఖేల్‌ ఖతం. రాజస్థాన్‌ ఖాతాలో అనూహ్య విజయం!

IPL 2021, PBKS Vs RR Highlights: Rajasthan Royals beat Punjab Kings by 2 runs
PBKS Vs RR: పంజాబ్​ ఓటమికి కారణం అతడే!
author img

By

Published : Sep 22, 2021, 6:46 AM IST

ఐపీఎల్‌ రెండో అంచెను రాజస్థాన్‌ సంచలన విజయంతో ఆరంభించింది. మంగళవారం 2 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఓపెనర్లు మయాంక్‌ (67; 43 బంతుల్లో 7×4, 2×6), రాహుల్‌ (49; 33 బంతుల్లో 4×4, 2×6) చెలరేగడం వల్ల 186 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా కనిపించిన పంజాబ్‌.. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' కార్తీక్‌ త్యాగి (2/29) సంచలన ఆఖరి ఓవర్‌ ఫలితంగా ఊహించని విధంగా ఓటమి చవిచూసింది. మొదట రాజస్థాన్‌ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైశ్వాల్‌ (49; 36 బంతుల్లో 6×4, 2×6), లొమ్రార్‌ (43; 17 బంతుల్లో 2×4, 4×6), లూయిస్‌ (36; 21 బంతుల్లో 7×4, 1×6) మెరుపులతో 200 దాటేలా కనిపించిన రాజస్థాన్‌కు అర్ష్‌దీప్‌ (5/32), షమి (3/21) కళ్లెం వేశారు.

జోరంతా పంజాబ్‌దే కానీ..

బ్యాటింగ్‌లో ఇన్నింగ్స్‌ ఆఖర్లో లయ కోల్పోయిన రాయల్స్‌.. బౌలింగ్‌లో ఆరంభం నుంచే గాడి తప్పింది. అందుక్కారణం పేలవ ఫీల్డింగ్‌. రాహుల్‌ క్యాచ్‌లు ఒకటికి మూడు చేజారడం వల్ల రాజస్థాన్‌ జట్టులో నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. దీన్ని ఉపయోగించుకున్న పంజాబ్‌ ఓపెనర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా మయాంక్‌ అగర్వాల్‌ రెచ్చిపోయి ఆడాడు. రాహుల్‌ కూడా సమయోచితంగా షాట్లు ఆడాడు. ఆ జట్టు పదో ఓవర్లోనే 100 దాటేసింది.

12వ ఓవర్లో రాహుల్‌ ఔటయ్యేసరికి స్కోరు 120కి చేరుకుంది. తర్వాతి ఓవర్లోనే మయాంక్‌ కూడా వెనుదిరిగినప్పటికీ.. పూరన్‌ (32; 22 బంతుల్లో 1×4, 2×6), మార్‌క్రమ్‌ (26 నాటౌట్‌; 20 బంతుల్లో 2×4, 1×6) నిలకడగా ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే ఇన్నింగ్స్‌ ఆద్యంతం పంజాబ్‌ ఆధిపత్యం కొనసాగినా.. ఆఖరి ఓవర్లో కార్తీక్‌ అద్భుత బౌలింగ్‌తో విజయం రాయల్స్‌నే వరించింది.

ఆఖర్లో పడి..

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌ తొలి 15 ఓవర్లలో ఆడిన తీరు చూస్తే.. పంజాబ్‌ ముందు 210-220 మధ్య లక్ష్యం నిలిచేలా కనిపించింది. కొత్త ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ రాజస్థాన్‌కు మెరుపు ఆరంభాన్నిస్తే.. మరో ఓపెనర్‌ యశస్వి తన శైలికి భిన్నంగా చెలరేగి ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. లూయిస్‌ ధాటికి రాజస్థాన్‌ 4 ఓవర్లకే 53 పరుగులు చేసింది. ఈ దశలో లూయిస్‌, శాంసన్‌ (4) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా.. జైశ్వాల్‌ దూకుడుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

అతడికి లివింగ్‌స్టోన్‌ (25; 17 బంతుల్లో 2×4, 1×6) తోడవడం వల్ల 11 ఓవర్లకే రాయల్స్‌ స్కోరు 100 దాటింది. వీళ్లిద్దరూ తక్కువ వ్యవధిలో ఔటైనా.. లొమ్రార్‌ (43; 17 బంతుల్లో 2×4, 4×6) రాకతో హిట్టింగ్‌ మరో స్థాయికి చేరింది. 16 ఓవర్లకు రాయల్స్‌ స్కోరు 164/4. ఆ జట్టు అలవోకగా 200 దాటేలా కనిపించగా.. చివరి 4 ఓవర్లలో టపటపా వికెట్లు పడిపోవడం వల్ల స్కోరు 185కు పరిమితమైంది. అర్ష్‌దీప్‌ అయిదు వికట్లతో రాయల్స్‌కు కళ్లెం వేశాడు. షమి కూడా చివర్లో విజృంభించాడు. చివరి 4 ఓవర్లలో రాజస్థాన్‌ 6 వికెట్లు కోల్పోయి 21 పరుగులే చేసింది.

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: లూయిస్‌ (సి) మయాంక్‌ (బి) అర్ష్‌దీప్‌ 36; యశస్వి జైశ్వాల్‌ (సి) మయాంక్‌ (బి) హర్‌ప్రీత్‌ 49; శాంసన్‌ (సి) రాహుల్‌ (బి) పోరెల్‌ 4; లివింగ్‌స్టోన్‌ (సి) అలెన్‌ (బి) అర్ష్‌దీప్‌ 25; లొమ్రార్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) అర్ష్‌దీప్‌ 43; పరాగ్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షమి 4; తెవాతియా (బి) షమి 2: మోరిస్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షమి 5; చేతన్‌ సకారియా (సి) అండ్‌ (బి) అర్ష్‌దీప్‌ 7; సుదీప్‌ త్యాగి (బి) అర్ష్‌దీప్‌ 1; ముస్తాఫిజుర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్‌) 185; వికెట్ల పతనం: 1-54, 2-68, 3-116, 4-136, 5-166, 6-169, 7-175, 8-178, 9-185; బౌలింగ్‌: షమి 4-0-21-3; పోరెల్‌ 4-0-39-1; హుడా 2-0-37-0; అర్ష్‌దీప్‌ 4-0-32-5; అదిల్‌ రషీద్‌ 3-0-35-0; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3-0-17-1.

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) కార్తీక్‌ త్యాగి (బి) సకారియా 49; మయాంక్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) తెవాతియా 67; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 26; పూరన్‌ (సి) శాంసన్‌ (బి) కార్తీక్‌ త్యాగి 32; దీపక్‌ హూడా (సి) శాంసన్‌ (బి) కార్తీక్‌ త్యాగి 0; అలెన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 183; వికెట్ల పతనం: 1-120, 2-126, 3-183, 4-183; బౌలింగ్‌: ముస్తాఫిజుర్‌ 4-0-30-0; సకారియా 3-0-31-1; కార్తీక్‌ త్యాగి 4-0-29-2; మోరిస్‌ 4-0-47-0; తెవాతియా 3-0-23-1; లొమ్రార్‌ 1-0-7-0; రియాన్‌ పరాగ్‌ 1-0-16-0.

ఇదీ చూడండి.. IPL 2021: పంజాబ్​పై రాజస్థాన్ రాయల్స్​​ అద్భుత విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.