ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) రెండోదశ ఆదివారమే(సెప్టెంబరు 19) ప్రారంభం కానుంది. తొలిమ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరగనుంది. ఈ లీగ్.. ఎంతోమంది యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడం సహా ఆర్థికంగానూ వాళ్లను నిలదొక్కుకునేలా చేసింది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వారిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ(RCB Captain Virat Kohli) ముందున్నాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా అత్యధిక మొత్తం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ, ఐపీఎల్ ద్వారా అత్యధికంగా ఆర్జించిన క్రికెటర్ మాత్రం టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ! ఇప్పటివరకు 14 సీజన్లలో ఆడిన మహీ.. రూ.150 కోట్లకు మేర ఆర్జించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎంఎస్ ధోనీ
ఐపీఎల్ టోర్నీ ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. దాదాపుగా రూ.150 కోట్లు(Dhoni IPL Remuneration) ఆర్జించినట్లు సమాచారం. 2008 నుంచి 2021 వరకు జరిగిన సీజన్లలో ఈ మొత్తాన్ని ధోనీ అందుకున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐపీఎల్ సంపాదనలో(Rohit Sharma IPL Career) కోహ్లీతో పోలిస్తే కొంచెం ముందే ఉన్నాడు. దాదాపుగా రూ.146.6 కోట్లను(Rohit Sharma IPL Remuneration) ఐపీఎల్ ద్వారా హిట్‌మ్యాన్ సంపాదించినట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ
ఐపీఎల్ అత్యధిక సంపాదన(Kohli IPL Remuneration) జాబితాలో మూడో బ్యాట్స్‌మన్ ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ప్రస్తుత 14వ సీజన్లో అత్యధికంగా రూ.17 కోట్లు పారితోషికం(Highest Paid Cricketer In IPL) అందుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ కెరీర్ మొత్తంలో కోహ్లీ దాదాపుగా రూ.143.2 కోట్లను ఆర్జించాడు.
ఇదీ చూడండి.. IPL 2021: రోహిత్ శర్మ పేరిట రికార్డులే రికార్డులు!