ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(IPL News) గత 13 ఏళ్లుగా ట్రోఫీ దక్కించుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ, ప్రస్తుత సీజన్లో మాత్రం కప్పు కొట్టేలా కనిపిస్తోంది. అందుకు కారణం ఈ సీజన్లో ఆర్సీబీ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తుండటం. ఈ వరుస విజయాల్లో అటు బ్యాట్స్‌మన్‌తో పాటు బౌలర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
ముఖ్యంగా బౌలింగ్ లైనప్‌లో పేసర్ హర్షల్ పటేల్(Harshal Patel News) ప్రస్తుత సీజన్లో కీలకంగా మారాడు. ముంబయితో తొలి మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి.. అదే జట్టుపై ఈ మధ్య రెండో మ్యాచ్‌లోనూ హ్యట్రిక్ వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడీ బౌలర్ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఐపీఎల్‌లోని ఒకే సీజన్లో(2013లో 32 వికెట్లు) అత్యధిక వికెట్లు పడగొట్టిన డ్వేన్ బ్రావో రికార్డును(Bravo Record in IPL) అధిగమించేందుకు కొద్దిదూరంలో ఉన్నాడు.
పర్పుల్ క్యాప్ హోల్డర్
ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన హర్షల్ పటేల్. ఆడిన 11 మ్యాచ్‌ల్లో 26 వికెట్లను పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో(Purple Cap in IPL 2021) తొలిస్థానంలో ఉన్నాడు. ఈసారి ఏవిధంగానైనా ట్రోఫీ నెగ్గాలనే ధ్యేయంతో ఉన్న కోహ్లీసేనకు హర్షల్ కీలకంగా కనిపిస్తున్నాడు. లీగ్‌లో ఆర్సీబీ ఆడాల్సిన మ్యాచ్‌లు(RCB in IPL 2021) మరో మూడు ఉండటం వల్ల హర్షల్.. బ్రావో రికార్డు దాటేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం కనిపించడం లేదు.
కోహ్లీ సారథ్యంలో మెరిశాడు
ఐపీఎల్లో హర్షల్ పటేల్ వరుసగా 9వ సీజన్ ఆడుతున్నా.. బౌలర్‌గా అతడి ప్రదర్శన దృష్ట్యా సరైన గుర్తింపు రాలేదు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ జట్టులో చేరి కోహ్లీ సారథ్యంలో బౌలింగ్‌లో మరింత మెరుగయ్యాడు. ఆర్సీబీలో చేరిన తర్వాతే అతడికి బౌలర్‌గా మరింత గుర్తింపు వచ్చింది. హర్షల్ పటేల్‌కు కోహ్లీ మద్దతుగా నిలవగా.. కెప్టెన్ నమ్మకాన్ని హర్షల్ పలు మ్యాచ్‌ల్లో నిలబెట్టాడు. కీలక ఓవర్లలో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టి డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా మారాడు.
"దిల్లీ క్యాపిటల్స్ నుంచి ఆర్సీబీ కోసం వేలంలో నన్ను సొంతం చేసుకున్న తర్వాత టీమ్‌లో నేను పోషించే పాత్ర ఏమిటో చెప్పారు. మ్యాచ్‌లోని చివరి రెండు ఓవర్లు బౌలింగ్ చేయాలని అన్నారు. అప్పుడే నాకు స్పష్టత వచ్చింది. ముందుగా చెప్పడం వల్ల బ్యాట్స్‌మెన్ ఎలా ఔట్ చేయాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు సహాయపడింది. విభిన్న పరిస్థితులు లేదా భిన్నమైన వాతావరణాలకు నేను అలవాటుపడ్డాను. అది నాకు కలిసొచ్చే అంశం. యూఏఈలో మైదానాలు పెద్దవి.. పిచ్‌లు చాలా నెమ్మదిగా ఉంటాయి. ఇలాంటి పిచ్‌లలో నా బౌలింగ్ సరిపోతుంది"
- హర్షల్ పటేల్స్, ఆర్సీబీ పేసర్
క్రికెట్ కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో గుజరాత్(2009-2011) తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్(Harshal Patel First Class Career) ఆడాడు హర్షల్ పటేల్. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు హరియాణా జట్టులో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆ జట్టు రంజీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఐపీఎల్లో(Harshal Patel IPL Career) 2021-2017 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొనసాగి.. ఆ తర్వాత 2018 నుంచి 2020 వరకు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది మళ్లీ ఆర్సీబీ జట్టు తిరిగి వేలంలో హర్షల్ పటేల్‌ను సొంతం చేసుకుంది.
ఇదీ చూడండి.. Srikar Bharat RCB: తెలుగు క్రికెటర్‌పై మ్యాక్స్‌వెల్ ప్రశంసలు