దక్షిణాఫ్రికా మాజీ సారథి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్ తనను తాను ముసలోడుగా సంబోధించుకున్నాడు. తాజాగా ఐపీఎల్ కోసం యూఏఈలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన అతడు తన ఆట గురించి మాట్లాడుతూ ఇలా పేర్కొన్నాడు. చెమటోడ్చి కష్టపడటం వల్ల కాస్త బరువు తగ్గే అవకాశముందని.. తనలాంటి ముసలోడు వీలైనంత మేర ఆటలో పోటీపడేందుకు నిత్యనూతనంగా ఉండాలని చెప్పాడు.
"ఈ ప్రాక్టీస్ సెషన్ గొప్పగా జరిగింది. మళ్లీ ఈ క్యాంప్‌లో అందర్నీ కలవడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సీజన్ ప్రారంభం కోసమే ఎదురుచూస్తున్నారు. నేనైతే రేపటి ప్రాక్టీస్ కోసం ఆసక్తిగా ఉన్నా. ఇప్పటివరకు మా జట్టులో కొంతమంది వచ్చారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. అయితే, వచ్చిన వారితో మాట్లాడి ఇన్ని రోజులు ఏం చేశారో తెలుసుకున్నా. కొన్ని ఆసక్తికర విషయాలు కూడా తెలిశాయి."
-డివిలియర్స్.
ఈ సెషన్‌లో డివిలియర్స్ ప్రాక్టీస్ అదిరిపోయింది. బంతిని మైదానం నలువైపులా ఆడుతూ రాబోయే సీజన్‌లో అదరగొట్టేలా కనిపించాడు. మరి సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో ఏబీ ఎలా ఆడతాడో చూడాలి. ఇక సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయేసరికి బెంగళూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి 10 పాయింట్లతో కొనసాగుతోంది.
ఇదీ చూడండి.. Kohli Captaincy: కోహ్లీ కెప్టెన్సీలో మార్పు.. బీసీసీఐ క్లారిటీ