ETV Bharat / sports

DC Vs KKR: కోల్​కతా ప్లేఆఫ్స్​ ఆశలను దిల్లీ ఆవిరి చేయనుందా?

ఐపీఎల్​లో(IPL 2021) ఇప్పటికే ప్లేఆఫ్స్​కు అడుగుదూరంలో నిలిచిన దిల్లీ క్యాపిటల్స్​ జట్టు కోల్​కతా నైట్​రైడర్స్​తో(DC Vs KKR) జరగనున్న మ్యాచ్​లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మ్యాచ్​లో గెలుపొంది ప్లేఆఫ్స్(IPL Playoffs 2021)​ బెర్తును ఖరారు చేసుకోవాలని పంత్​ సేన యోచిస్తుండగా.. ఇందులో విజయం సాధించి ప్లేఆఫ్​ ఆశలను సజీవం చేసుకోవాలని మోర్గాన్​ సేన సన్నద్ధమవుతోంది.

Eyeing play-off berth, DC have their nose ahead against KKR
DC Vs KKR: కోల్​కతా ప్లేఆఫ్స్​ ఆశలను దిల్లీ ఆవిరి చేయనుందా?
author img

By

Published : Sep 28, 2021, 8:13 AM IST

ఐపీఎల్​లో(IPL 2021) మంగళవారం జరగనున్న తొలి మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్(DC Vs KKR)​ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో ఇప్పటికే రెండోస్థానంలో నిలిచిన దిల్లీ జట్టు.. ఈ మ్యాచ్​లో కోల్​కతాను ఓడించి ప్లేఆఫ్స్​ బెర్తు(IPL Playoffs 2021) ఖరారు చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్​లో నెగ్గి ప్లేఆఫ్స్​ ఆశలు సజీవం చేసుకోవాలని కోల్​కతా సన్నద్ధమవుతోంది.

దిల్లీకి కలిసొచ్చే అంశం

కోల్​కతా ఆల్​రౌండర్​ ఆండ్రూ రస్సెల్​ గాయమైన(Andre Russell Injury) కారణంగా దిల్లీతో జరిగే మ్యాచ్​లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది దిల్లీ జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రస్తుత సీజన్​లో ట్రోఫీని నెగ్గాలనే లక్ష్యంతో పంత్​ సేన.. అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ దూకుడుగా ఆడుతోంది. ఇప్పటికే ఆ జట్టుకు ప్లేఆఫ్స్​కు దాదాపుగా చేరుకోగా.. కోల్​కతాపై విజయం సాధిస్తే బెర్తును ఖరారు చేసుకుంటుంది. గతేడాది ఫైనల్​లో త్రుటిలో ట్రోఫీకి దూరమైన దిల్లీ టీమ్​.. ఈ సీజన్​లోనైనా కచ్చితంగా విజేతగా నిలవాలని భావిస్తోంది.

ప్లేఆఫ్స్​ ఆశల్లో..

ఐపీఎల్​లో ప్లేఆఫ్స్​ ఆశలను సజీవం చేసుకోవాలని కోల్​కతా నైట్​రైడర్స్​ సన్నద్ధమవుతోంది. గత మ్యాచ్​ తాలూకా ఓటమి కారణాలను దృష్టిలో ఉంచుకొని వాటిని అధిగమించేందుకు కసరత్తులు చేస్తోంది. దిల్లీ జట్టు అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ బలంగా ఉండడం వల్ల ఈ మ్యాచ్​లో గెలుపు కోసం మోర్గాన్​ సేన మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్​ లైనప్​లో ఓపెనర్లు శుభ్​మన్​ గిల్​, వెంకటేశ్​ అయ్యర్​తో పాటు మిడిల్​ ఆర్డర్​లో కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​, దినేశ్​ కార్తిక్​, రాహుల్​ త్రిపాఠి వంటి అద్భుతమైన​ బ్యాట్స్​మెన్​ ఉన్నారు. ఆల్​రౌండర్​ ఆండ్రూ రస్సెల్​ మ్యాచ్​కు దూరమైతే అతడి స్థానంలో ఎవర్ని ఎంపిక చేస్తారనే విషయమై ఆసక్తి నెలకొంది.

మ్యాచ్​ సమయం..

ఐపీఎల్​లో మంగళవారం జరగనున్న తొలి మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ జట్లు తలపడనున్నాయి. షార్జా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు​ ప్రారంభం కానుంది.

తుదిజట్లు(అంచనా):

దిల్లీ క్యాపిటల్స్​: పృథ్వీ షా, శిఖర్​ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్​ పంత్(కెప్టెన్), లలిత్ యాదవ్, హెట్​మెయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్​ అశ్విన్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్ట్జ్, ఆవేశ్ ఖాన్.

కోల్​కతా నైట్​రైడర్స్​: శుభ్​మన్​ గిల్​, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రానా, ఇయాన్​ మోర్గాన్ (కెప్టెన్), దినేశ్ కార్తీక్(వికెట్​ కీపర్​), ఆండ్రూ రసెల్, సునీల్ నరేన్, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ.

ఇదీ చూడండి.. IPL 2021: రాజస్థాన్​పై సన్​రైజర్స్​ విక్టరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.