ETV Bharat / sports

IPL Dhoni Retirement : మహీ మనసులో ఏమున్నట్టు.. ఒక్కోసారి ఒక్కోలా! - ఐపీఎల్ రిటైర్మెంట్​పై ధోనీ రియాక్షన్​

IPL Dhoni Retirement : ఐపీఎల్ 16వ సీజన్ తుది దశకు చేరుకుంది. సీఎస్కే ఫైనల్​కు అర్హత సాధించింది. అయితే మళ్లీ మహీ రిటైర్మెంట్​ చర్చ తెరపైకి వచ్చింది. అయితే దీనిపై ఈ సీజన్​లో ఇప్పటికే పలుసార్లు మాట్లాడాడు కూడా. అయితే ఇంతకీ అతడి మనసులో ఏముందో సరిగ్గా చెప్పనేలేదు. ఓసారి ఈ సీజన్​లో మహీ ఎప్పుడెప్పుడు ఏమన్నాడో గుర్తుచేసుకుందాం..

IPL Dhoni Retirement
IPL Dhoni Retirement : మహీ మనసులో ఏమున్నట్టు.. ఒక్కోసారి ఒక్కోలా..
author img

By

Published : May 24, 2023, 6:54 PM IST

IPL Dhoni Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023 సీజన్‌ తుది దశకు చేరుకుంది. క్వాలిఫయర్​ -1లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్​కు దూసుకెళ్లింది చెన్నై సూపర్‌ కింగ్స్‌. అయితే ఎప్పటిలాగే మళ్లీ అదే చర్చ తెరపైకి వచ్చింది. అదే ధోనీ ఐపీఎల్​ రిటైర్మెంట్​. ఈ సీజన్‌ పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాదిలో మహీ ఐపీఎల్ బ్యాట్​ పడతాడా? లేదా? అనేది ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. దీనిపై క్వాలిఫయర్‌ 1 మ్యాచ్ తర్వాత మహీ స్పందించాడు. అయితే.. ఇప్పటికే ఈ సీజన్‌లో ఈ విషయంపై పలుమార్లు మాట్లాడాడు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతూ వచ్చాడు. అసలు అతడి మెదడులో ఏముందో తెలియక అభిమానులు తికమక పడుతున్నారు. ఏదేమైనా మహీ మాత్రం తన ఆటను కొనసాగించాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ ఈ సీజన్​లో తన రిటైర్మెంట్‌ గురించి ఎప్పుడెప్పుడు ఏమన్నాడో ఓసారి చూద్దాం..

  • క్వాలిఫయర్​ 1లో గుజరాత్‌ టైటాన్స్​పై విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించిన అనంతరం ధోనీ తన రిటైర్మెంట్​ గురించి మాట్లాడాడు. చెపాక్‌లో మళ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయా..? అనే అడిగిన ప్రశ్నకు స్పందించాడు. "ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఇంకా 8-9 నెలల సమయం ఉంది. డిసెంబర్‌లో మళ్లీ మినీ వేలం జరుగుతుంది. కాబట్టి.. దాని గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం ఏముంది. ఆ తలనొప్పి ఇప్పుడెందుకు. నాకు కావాల్సినంత సమయం ఉంది. చెన్నై కోసం ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. టీమ్​ కోసం మైదానంలో ఆడటమా? లేదంటే స్టాండ్స్​లో కూర్చోవడమా? అనే దానిపై డిసైడ్​ చేసుకునేందుకు ఇంకా సమయం ఉంది" అని చెప్పుకొచ్చాడు.
  • ఇక ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్​ రైడర్స్​తో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ తన ఐపీఎల్​కు గుడ్​బై చెప్పడంపై సరదా వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌ జరిగింది కోల్‌కతా సొంత మైదానంలోనే అయినప్పటికీ.. అభిమానులు మాత్రం భారీగా సీఎస్కేకు మద్దతుగా తెలిపారు. మ్యాచ్‌ అనంతరం ధోనీ.. తనకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకే.. వీరంతా చెన్నై జెర్సీలో వచ్చినట్టుందని అన్నాడు.
  • లీగ్‌ స్టేజ్​లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్​తో జరిగిన ఓ మ్యాచులో టాస్‌ సమయంలోనూ మాట్లాడాడు. "మీ చివరి సీజన్‌ను ఆస్వాదిస్తున్నారా?" అని అడిగిన ప్రశ్నకు.. "ఇది నా చివరి ఐపీఎల్‌ సీజన్​ అని మీరే డిసైడ్‌ చేసేశారా?" అంటూ నవ్వులు పూయించాడు మహీ.
  • సన్​రైజర్స్​తో మ్యాచ్​ జరిగినప్పుడు.. ఇప్పుడు కెరీర్‌ చివరి దశలో ఉన్నాను. ఇప్పటికే చాలా మంది నా కెరీర్‌ గురించే చర్చించుకుంటున్నారు. నేను ఎంతకాలం ఆడినా.. ఇప్పుడైతే కెరీర్‌ చివరి దశలోనే ఉన్నాను. ప్రస్తుతం దానిని ఎంజాయ్‌ చేస్తున్నాను. వయసు పెరుగుతుందంటే.. ఎక్కువ అనుభవం వచ్చినట్టే. నేను ఎప్పుడూ నా వయసు పెరిగిపోతుంది అని చెప్పడానికి అస్సలు సిగ్గుపడను" అని మహీ వ్యాఖ్యలు చేశాడు.
  • ఈ సీజన్ లీగ్‌ స్టేజ్​లో హౌం గ్రౌండ్​ చెపాక్‌ వేదికగా చివరి మ్యాచ్‌ను ఆడిన తర్వాత కూడా మహీ మాట్లాడాడు. స్టేడియంలో సహ ప్లేయర్స్​తో కలిసి పరేడ్‌ కూడా నిర్వహించాడు. అభిమానుల వైపు జెర్సీలు విసిరాడు. వారికి కృతజ్ఞతలు తెలిపగాడు. ఈ సమయంలోనే దిగ్గజ క్రికెటర్‌, కామెంటేటర్‌ సునీల్‌ గావస్కర్‌ సైతం.. స్పీడు స్పీడుగా వచ్చి.. తన షర్ట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం విశేషం. దీంతో మహీ.. తన రిటైర్మెంట్​ గురించి ఏదైనా సూచనలు ఇస్తున్నాడా.. అనే అనుమానం అందరిలో కలిగింది.

ఇదీ చూడండి: IPL 2023 CSK Final : చెన్నై మ్యాజిక్​.. ఫైనల్​ చేరుకోవడానికి కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.