Weather In Amedabad : ప్రేక్షకుల కేరింతలు, ఘనమైన సంబరాల మధ్య ముగియాల్సిన ఐపీఎల్ టోర్నమెంట్, వర్షం కారణంగా నిలిచిపోయింది. రాత్రి 11 గంటల వరకు కూడా మ్యాచ్ జరుగుతుందేమోనని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్నందున ఫైనల్ సోమవారానికి వాయిదా పడింది. కానీ సోమవారం కూడా మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించ వచ్చునని వాతావరణ శాఖ తెలిపినప్పటికీ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మ్యాచ్‌కు అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Amedabad Weather Update : సోమవారం మధ్యాహ్నానికి అహ్మదాబాద్‌లో మబ్బులు పూర్తిగా తొలగిపోయి వాతావరణం పొడిగా మారింది. అక్కడి ప్రజలను సూర్యుడు పలకరించటంతో క్రీడాభిమానుల మొహంలో ఆనందం విరబూసింది. దీంతో మ్యాచ్ జరగటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ మధ్యలో కాస్త వర్షం కురిసినా.. ఆది అంతగా ప్రభావం చూపదని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఆదివారం మ్యాచ్ రద్దు కావటంతో.. టిక్కెట్లు ఉన్న వారందనీ సోమవారం జరిగే ఫైనల్‌కు అనుమతిస్తామని స్టేడియం నిర్వాహకులు తెలిపారు..
-
Current situation of Narendra Modi Stadium.
— Johns. (@CricCrazyJohns) May 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
It's Sunny day! pic.twitter.com/IPki2LPLx7
">Current situation of Narendra Modi Stadium.
— Johns. (@CricCrazyJohns) May 29, 2023
It's Sunny day! pic.twitter.com/IPki2LPLx7Current situation of Narendra Modi Stadium.
— Johns. (@CricCrazyJohns) May 29, 2023
It's Sunny day! pic.twitter.com/IPki2LPLx7
ముగింపు వేడుకలు సింపుల్‌గా..
అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఐపీఎల్ సీజన్ కూడా ఘనంగా ముగించాలని బోర్డు భావించింది. అందుకు తగ్గ ఏర్పాట్లను భారీ ప్రణాళికతో సిద్ధం చేసింది. కానీ ఆదివారం వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రిజర్వ్ డే సోమవారం అలాంటి ఘనమైన వేడుకలేవి ఉండకపోవచ్చని సమాచారం. పదహారేళ్ల ఐపీఎల్ హిస్టరీలో వర్షం.. లీగ్‌లో చాలా మ్యాచ్‌లకు ఆటంకం కలిగించింది. కానీ ఫైనల్ మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడటం ఇదే తొలిసారి. కాగా, రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకపోతే.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ విజేతగా ప్రకటిస్తారు. ఇదే గనక జరిగితే చెన్నై నష్టపోతుందనే చెప్పాలి.
గుజరాత్‌కు సెంటిమెంట్..
IPL 2023 Final Reserve Day : చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రిజర్వ్ డే రోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఆదివారం నాటి తేదీతో చెన్నై టీమ్‌కు సెంటిమెంట్ ఉంటే.. సోమవారం (మే 29)తో గుజరాత్‌కు మంచి అనుబంధం ఉంది. అదేంటంటే.. గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన జీటీ 2022లో సరిగ్గా ఇదే రోజున ఫైనల్లో రాజస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ నెగ్గింది. దీంతో ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా మే 29 నాడే జరగటంతో విజయం తమదేనని గుజరాత్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ రెండు ఫైనల్ మ్యాచ్‌లు కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలోనే జరగటం విశేషం.
-
Live picture from Ahmedabad - Weather is very good and it's sunny day at Ahmedabad. pic.twitter.com/xfBSwT2iA5
— CricketMAN2 (@ImTanujSingh) May 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Live picture from Ahmedabad - Weather is very good and it's sunny day at Ahmedabad. pic.twitter.com/xfBSwT2iA5
— CricketMAN2 (@ImTanujSingh) May 29, 2023Live picture from Ahmedabad - Weather is very good and it's sunny day at Ahmedabad. pic.twitter.com/xfBSwT2iA5
— CricketMAN2 (@ImTanujSingh) May 29, 2023