ETV Bharat / sports

వారి కోసం కోట్లు కుమ్మరించిన ముంబయి ఇండియన్స్ - ఐపీఎల్​ మెగావేలం ముంబయి ఇండియన్స్​

IPL mega auction 2022 Mumbai indians: ఐపీఎల్​ వేలంలో ముంబయి ఇండియన్స్​ ఆచితూచి వ్యవహరించింది. తొలిరోజు పెద్దగా ప్లేయర్లపై ఆసక్తి చూపని ఈ ఫ్రాంఛైజీ రెండో రోజు చివర్లో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించింది. మిగతా జట్లకు దక్కకుండా.. వీరిని కొనుగోలు చేసింది. వారెవరో చూద్దాం.

IPL mega auction 2022 Mumbai indians
ముంబయి ఇండియన్స్​
author img

By

Published : Feb 13, 2022, 5:27 PM IST

IPL mega auction 2022 Mumbai indians: రెండో రోజు ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ మెగా వేలం ఆసక్తికరంగా సాగింది. అయితే.. తొలిరోజు మెగావేలంలో నలుగురినే కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్​.. రెండో రోజు ఆఖర్లో దూకుడుగా వ్యవహరించింది.
వరుసగా విదేశీ ప్లేయర్లను దక్కించుకుంది. వీరికోసం పెద్ద మొత్తమే వెచ్చించింది.

టిమ్​ డేవిడ్​..

అంతర్జాతీయ టీ-20 టోర్నీల్లో ఇరగదీస్తున్న టిమ్​ డేవిడ్​ కోసం రూ. 8.25 కోట్లు వెచ్చించింది. ఇతడి టీ-20 స్ట్రైక్​ రేట్​ 159.39 కావడం విశేషం. బంతిని బలంగా బాదగల ఈ పొడగరి కచ్చితంగా టీమ్​లో ఉండే అవకాశముంది.

జోఫ్రా ఆర్చర్​..

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ను రూ. 8 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అత్యంత వేగంగా బౌలింగ్​ చేయగలగడం ఇతడి బలం. ఇంకా డెత్​ ఓవర్లలో యార్కర్లతో బెంబేలెత్తిస్తాడు. ఇప్పటికే ఉన్న బుమ్రాకు ఇతడు తోడైతే ముంబయి బౌలింగ్​ మరింత పదునెక్కనుంది.

డేనియల్​ సామ్స్​..

ఈ ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ను రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడు ఇటీవలి బిగ్​ బాష్​ లీగ్​లో ఆకట్టుకున్నాడు.

టైమల్​ మిల్స్​..

ఇంగ్లాండ్​ పేసర్​ టైమల్​ మిల్స్​ను కూడా రూ. 1.50 లక్షలకు తమ వశంచేసుకుంది ముంబయి ఇండియన్స్​.

అంతకుముందు హైదరాబాద్​ రంజీ యువ ఆటగాడు, ఆల్​రౌండర్​ తిలక్​వర్మను రూ.1.70 కోట్లు పెట్టి తీసుకుంది.

భారత పేసర్​ జయ్​దేవ్​ ఉనద్కత్​ కోసం రూ.1.30 కోట్లు వెచ్చించింది.

ఇదీ చూడండి: ఖలీల్​, సకారియాకు, రాజ్​ బవాకు సూపర్​ రెస్పాన్స్​- యశ్​ ధుల్​ ప్చ్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.