ETV Bharat / sports

IPL 2023: ధోనీ ప్రాక్టీస్​ షురూ.. అదిరిపోయే షాట్లతో నెట్స్​ హోరు.. వీడియో చూశారా? - ఐపీఎల్​ 2023 చెన్నై సూపర్​ కింగ్స్​

చెన్నై సూపర్​ కింగ్​ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.. ఐపీఎస్​ కోసం ప్రాక్టీస్​ మొదలుపట్టేశాడు. నెట్స్​లో బౌలర్లను ఎదుర్కొంటూ తనదైన శైలిలో షాట్లతో అలరిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను సీఎస్​కే.. సోషల్​మీడియాలో పోస్ట్​ చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 4, 2023, 3:25 PM IST

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇటీవేల మినీ వేలం కూడా ముగిసింది. కొందరు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీలు.. మరికొందరిని వేలంలో కొనుగోలు చేశాయి. అయితే చెన్నై సూపర్​ కింగ్​ జట్టు కెప్టెన్​, టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్​ ధోనీ సన్నద్ధమవుతున్నాడు. చెన్నైలోని చిదంబరం స్డేడియంలో ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు.

నెట్స్​లో బౌలర్లను ఎదుర్కొంటూ మిస్టర్​ కూల్​.. తనదైన శైలిలో షాట్లతో అలరిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను సీఎస్‌కే ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఆ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. "మహీ భాయ్‌ వచ్చేస్తున్నాడు. ఐదో ట్రోఫీని గెలిచి తీరతాడు. ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం" అంటూ చెన్నై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మార్చి 31 నుంచి మే 28వ తేదీ వరకు ఐపీఎల్​ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్​ గుజరాత్ టైటాన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య మ్యాచ్​తో ఈ క్యాష్​ రిచ్​ లీగ్​కు తెరలేవనుంది. ఇప్పటివరకు చెన్నై జట్టుకు నాలుగు ట్రోఫీలు అందించిన ధోనీ.. సక్సెస్​ఫుల్​ సారథిగా పేరు సంపాదించాడు. గతేడాది డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టీమ్​ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను సారథిగా నియమించి భారీ మూల్యం చెల్లించుకుంది. కెప్టెన్సీ భారాన్ని భరించలేని జడ్డూ మధ్యలోనే పగ్గాలు వదిలేయగా.. మళ్లీ ధోనీ ఆ బాధ్యతను తలకెత్తుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం పోయింది. 14 మ్యాచుల్లో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఇకపోతే, ఆటగాడిగా ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్‌ అన్న వార్తల నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టైటిల్‌ గెలవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఐదోసారి జట్టుకు కప్​ అందించాలని అంటున్నారు. మరోవైపు.. ఈసారి వేలంలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ను కొనుగోలు చేసిన సీఎస్‌కే.. ధోనీ సూచన మేరకు అతడిని సీఎస్‌కే సారథిగా నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.