Sunrisers Hyderabad Washington sundar injured: విజయోత్సాహంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు గాయమైంది. ఈ కారణంగా తదుపరి జరగాల్సిన రెండు మ్యాచ్‌లకు సుందర్ దూరం కానున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హెడ్‌కోచ్ టామ్ మూడీ తెలిపారు. గుజరాత్ టైటాన్స్-ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన వాషింగ్టన్ 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే అప్పటికే అతడి చేతికి గాయమైంది. దీంతో తన బౌలింగ్ కోటా పూర్తిచేయకుండానే వెనుదిరిగాడు.
"వాష్టింగ్టన్ కుడి చేతి బొట వేలు, మొదటి వేలుకు మధ్య చీలిక వచ్చింది. రాబోయే రెండు మూడు రోజుల పాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి. అతడు కోలుకోవడానికి ఓ వారం రోజు పట్టొచ్చు" అని టామ్‌మూడీ తెలిపాడు.
కాగా, ఈ ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్‌పై గెలుపుతో బోణీ కొట్టిన సన్‌రైజర్స్.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి తన ఖాతాలో రెండో విజయాన్ని వేసుకుంది.
ఇదీ చూడండి: షమీపై హార్దిక్ ఫైర్.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్