ETV Bharat / sports

బీసీసీఐ కీలక నిర్ణయం!.. ఐపీఎల్​ ఫైనల్​లో మార్పు.. కారణమదేనా?

author img

By

Published : May 19, 2022, 6:15 PM IST

IPL 2022 Final Match: ఐపీఎల్​ 15వ సీజన్​ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఏడాది లీగ్​లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్​, లఖ్​నవూ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్​ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. కాగా, మే 29న జరగనున్న ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​ టైమింగ్​ను బీసీసీఐ​ మార్చినట్లు సమాచారం. దాంతో పాటు ఈ సీజన్​ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

IPL 2022 final in Ahmedabad set to start at 8 PM

IPL 2022 Final Match: ఐపీఎల్‌-2022 చివర దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్‌ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్‌ 15వ సీజన్​ ఫైనల్‌ మ్యాచ్‌ టైమింగ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. మే 29న రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమవ్వాల్సిన మ్యాచ్‌ను 8 గంటలకు ఆరంభించనున్నట్లు సమాచారం.

కరోనా వల్ల గత రెండేళ్లుగా ఐపీఎల్​ ఆరంభ, ముగింపు వేడుకలను నిర్వహించని బీసీసీఐ.. ఈ సీజన్​ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆస్కార్​ విజేత ఏఆర్​ రెహ్మాన్​, స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​లతోపాటు ప్రముఖ బాలీవుడ్​ తారలతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ వేళలో మార్పు చేసినట్లు క్రిక్‌బజ్‌ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్​ను కూడా సవరించింది. మే 24 నుంచి ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. కోల్‌కతాలో ఫస్ట్‌ క్వాలిఫైయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్​-2, ఫైనల్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఏడాది లీగ్​లో చేరిన కొత్త ఫ్రాంఛైజీలు గుజరాత్‌ టైటాన్స్‌, లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ జట్లు అద్భుతమైన ప్రదర్శనలతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి.

క్రికెట్​​ అభిమానులకు గుడ్​న్యూస్​.. జూన్​ 9న ప్రారంభం కానున్న భారత్​- దక్షిణాఫ్రికా టీ20 సిరీస్​కు స్టేడియం సీటింగ్‌ సామర్థ్యంలో 100 శాతం మంది ప్రేక్షకులకు అనుమతిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్లీ, కటక్, విశాఖపట్నం, రాజ్‌కోట్, బెంగళూరు వేదికల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జూన్ 9న ఈ సిరీస్ ప్రారంభం కానుండగా, చివరి మ్యాచ్ జూన్ 19న జరగనుంది. టీమ్​ఇండియాతో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా ఇటీవలే 16 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది.

ఇవీ చదవండి: కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్​గా.

ఐపీఎల్ హక్కులకు రూ.33వేల కోట్లు.. మ్యాచ్ టైమింగ్స్​లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.