ETV Bharat / sports

సూపర్​ ఓవర్​ సుందరి.. ఇంతకీ ఆమె ఎవరు? - Riana Lalwani news

ముంబయి, పంజాబ్​ మ్యాచ్​లో.. గోళ్లు కొరుకుతూ మ్యాచ్​ చూస్తున్న ఓ అమ్మాయి ఫొటో వైరల్​గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏ ఫ్రాంచైజీ అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.

The 'mystery girl' who became an internet sensation after KXIP vs MI Super Over tie
రియానా లాల్వాణి
author img

By

Published : Oct 21, 2020, 3:17 PM IST

గత ఆదివారం ఐపీఎల్​ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ జరిగింది. ముంబయి, పంజాబ్‌ మధ్య జరిగిన ఈ పోరులో విజేతను నిర్ణయించేందుకు ఏకంగా రెండు సూపర్‌ ఓవర్లు అవసరమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు పంజాబ్‌ గెలిచింది. అయితే.. పంజాబ్‌ లక్ష్య ఛేదన చివరి ఓవర్‌లో ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేడియంలో మ్యాచ్‌ చూస్తూ టెన్షన్‌తో గోళ్లు కొరుకుతున్న ఆమె ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతుండగా టీవీ స్క్రీన్‌పై ఒక్కసారిగా తళుక్కుమన్న ఆ సుందరి ఎవరా? అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఆమె ఆచూకీ ఇన్‌స్టాలో దొరికింది. ఆమె పేరు రియానా లాల్వాణి. ఎవరు? ఎక్కడుంటుంది? అనే వివరాలు తెలియలేదు.

Riana Lalwani
మ్యాచ్​లో రియా లాల్వాణీ

కొవిడ్‌19 కారణంగా మైదానంలో బయోబబుల్‌ నిబంధనలు ఉన్నాయి. ఈ క్రమంలో స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ చూస్తోంది అంటే.. ఆమె రెండు ఫ్రాంచైజీల్లో ఏదో ఒక జట్టుకు చెందిన అమ్మాయి అని తెలుస్తోంది.

సోషల్‌ మీడియాలో ఆమెకు ఒక్కసారిగా ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఇన్​స్టాలో ఇప్పటి వరకూ కేవలం 11 పోస్టులు పెట్టిన ఆమెకు.. ఫాలోవర్స్ సంఖ్య 61,000 దాటింది. ఇదంతా చూసిన ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ప్రొఫైల్‌లో 'దుబాయ్‌.. దట్‌ సూపర్‌ ఓవర్‌ గళ్' అని రాసి ఉంచింది. అంతేకాదండోయ్‌ 'రియానా ఫ్యాన్స్‌ క్లబ్‌' పేరుతో సోషల్‌ మీడియాలో పేజీలు కూడా పుట్టుకొచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.