ETV Bharat / sports

బంతికి ఉమ్మి రాస్తూ అడ్డంగా దొరికిన ఉతప్ప - ఉతప్ప సలైవా

ఐసీసీ నిబంధనలు అతిక్రమించిన సీనియర్ ఆటగాడు ఉతప్ప.. ఐపీఎల్ మ్యాచ్​లో బంతికి ఉమ్మి రాస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

Uthappa accidentally applies saliva on ball
బంతికి ఉమ్మి రాస్తూ అడ్డంగా దొరికిన ఉతప్ప
author img

By

Published : Oct 1, 2020, 8:58 AM IST

కరోనా వైరస్‌ ముప్పుతో బంతిపై మెరుపు కోసం ఉమ్మిని(సలైవా) రుద్దకూడదని ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే శిక్షలు ఏంటో చెప్పింది. అలవాటులో పొరపాటో.. ఉద్దేశపూర్వకంగా చేశాడో తెలియదు గానీ బంతికి లాలాజలం రాస్తూ కెమెరాకు చిక్కాడు రాబిన్‌ ఉతప్ప.

దుబాయ్‌ వేదికగా గురువారం రాత్రి.. రాజస్థాన్‌, కోల్‌కతా తలపడ్డాయి. టాస్‌ గెలిచిన స్టీవ్‌స్మిత్‌ బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ (47), నితీశ్‌ రాణా (22), రసెల్‌ (24), మోర్గాన్‌ (34*) రాణించడం వల్ల 6 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ఛేదనలో రాజస్థాన్‌ తేలిపోయింది. 42 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. స్మిత్‌, సంజు, తెవాతియా, ఉతప్ప, రియాన్‌ విఫలమయ్యారు. టామ్‌ కరణ్‌ (54*) అర్ధశతకం బాదడమే ఆ జట్టుకు ఊరట. మిగతా ఆటగాళ్లు పరుగులు చేయకపోవడం వల్ల 137/9కే పరిమితమైంది.

కోల్‌కతా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రాజస్థాన్‌ ఫీల్డర్‌ రాబిన్‌ ఉతప్ప బంతికి ఉమ్మిని రుద్దాడు. మూడో ఓవర్‌ ఐదో బంతికి నరైన్‌ క్యాచ్‌ను అతడు నేలపాలు చేశాడు. ఆ తర్వాత బంతికి లాలాజలం రుద్దుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

బంతికి ఫీల్డర్‌ ఉమ్మి రుద్దితే అంపైర్లు కలగజేసుకొంటారు. బంతిని శుభ్రం చేయిస్తారు. మొదటి సారి ఫీల్డర్‌కు నిబంధనలను వివరిస్తారు. వరుసగా రెండుసార్లు చేస్తే హెచ్చరిస్తారు. ఆ తర్వాతా అలాగే చేస్తే శిక్షగా ప్రత్యర్థికి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు.

ఇది చదవండి: రాజస్థాన్​ వరుస విజయాలకు కోల్​కతా బ్రేక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.