ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితమే ఇతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. తాజాగా లీగ్‌ల నుంచీ తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. కెరీల్లో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.
"ఓ అద్భుత ఘట్టం ముగిసింది. నా జీవితంలోని రెండో ఘట్టంలోకి అడుగుపెడుతున్నందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నా. నా కలలను సాకారం చేసుకోవడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికీ ధన్యావాదాలు. ఓ కలతో నా కెరీర్ ప్రారంభమైంది. నా ఐదేళ్ల వయసులో టెస్టు మ్యాచులు చూసేవాడిని. అప్పుడు మా అమ్మగారికి ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడాలని చెప్పేవాడిని. ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించా. నా కలను సాకారం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఇదంతా చూస్తుంటే భలే ఉంది. నా చివరి మ్యాచ్‌ను సీఎస్కే తరఫున ఆడినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గత మూడేళ్ల నుంచి చెన్నై జట్టు నన్ను చాలా బాగా చూసుకుంది."
-వాట్సన్, ఆస్ట్రేలియా క్రికెటర్.
2002లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాట్సన్.. కెరీర్లో 59 టెస్టులు, 190 వన్డేలు, 58 టీ20 ఆడి.. మొత్తంగా 14 వేల పరుగులు చేశాడు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మొత్తంగా 145 మ్యాచులు ఆడాడు వాట్సన్. 2008, 2018లో ట్రోఫీని సొంతం చేసుకున్న రాయల్స్, చెన్నై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2008, 2013లో మ్యాన్ ఆఫ్ ధి టోర్న్‌మెంట్ అవార్డును అందుకున్నాడు. మొత్తంగా లీగ్ చరిత్రలో 137.91 స్ట్రైక్ రేట్‌తో 3,874 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు చేసి 92 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్ 299 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇదీ చూడండి అన్ని ఫార్మాట్లకు వాట్సన్ రిటైర్మెంట్