చెన్నై - ముంబయి మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్, ముంబయి కోచ్ జయవర్ధనే తమ అభిప్రాయలను తెలిపారు. ధోనీ రనౌటే మ్యాచ్‌ను మలుపు తిప్పిందని క్రికెట్ దిగ్గజం, ముంబయి ఇండియన్స్ మెంటార్ సచిన్ తెందూల్కర్ అభిప్రాయపడ్డారు. చివరి ఓవర్లలో అనుభవజ్ఞులకు బౌలింగ్ ఇచ్చి రోహిత్ మంచి నిర్ణయాలు తీసుకున్నాడని ముంబయి కోచ్ జయవర్ధనే అన్నాడు.
"ధోనీ రనౌటే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మలింగ 16 ఓవర్లో ధారాళంగా పరుగులిచ్చినా.. చివర్లో అద్భుతంగా వేశాడు. బుమ్రా చక్కటి ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండేళ్ల క్రితం 129 పరుగులను కాపాడుకోగలిగాం.. అందుకే విజయంపై ముందు నుంచి ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం" -సచిన్ తెందూల్కర్, ముంబయి మెంటార్
"ధోనీని మేం త్వరగానే పెవిలియన్‌కు పంపగలిగాం. కానీ వాట్సన్ తన హిట్టింగ్తో మ్యాచ్‌ను దూరం చేసే ప్రయత్నం చేశాడు. అలాంటి సమయంలో రోహిత్ డెత్ ఓవర్లలో అనుభవజ్ఞులకు బౌలింగ్ ఇచ్చి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు" - మహేల జయవర్ధనే, ముంబయి కోచ్
ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నైపై గెలిచింది. ఈ విజయంతో రోహిత్‌సేన నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. బుమ్రా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.