హైదరాబాద్‌తో తలపడిన మూడో టీ20లో బెంగుళూరు అద్భుత విజయం సాధించింది. ఓటమివైపు పయనిస్తున్న ఆ జట్టుని యుజువేంద్ర చాహల్(3), నవ్‌దీప్ సైని(2) శివమ్ దూబె(2) ఆదుకున్నారు. ఈ ముగ్గురూ కీలక సమయంలో చెలరేగడం వల్ల హైదరాబాద్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో 10 పరుగుల తేడాతో ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసింది. అంతకుముందు బెయిర్‌స్టో(61) అర్ధశతకంతో ఒంటరిపోరాటం చేసిన అది వృథా అయింది. అతడు ఔటయ్యాక వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్(56; 42 బంతుల్లో 8x4), ఆరోన్ ఫించ్ (29; 27 బంతుల్లో 1x4, 2x6) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించాక వరుస బంతుల్లో ఔటయ్యారు. తొలుత విజయ్ శంకర్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి దేవ్‌దత్ క్లీన్‌బౌల్డ్ కాగా, తర్వాత 12వ ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ బౌలింగ్‌లో ఫించ్ ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం కోహ్లీ (14), డివిలియర్స్ (51: 30 బంతుల్లో 4×4, 2×6) కాసేపు వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించగా భారీ షాట్ ఆడబోయి కెప్టెన్ ఔటయ్యాడు. బౌండరీలైన్ వద్ద రషీద్‌ఖాన్ చేతికి చిక్కాడు. ఆపై శివమ్‌దూబె(7) క్రీజులోకి రాగా, డివిలియర్స్‌కే ఎక్కువ అవకాశం ఇచ్చాడు. దీంతో చివర్లో గేర్ మార్చిన అతడు ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. చివరి ఓవర్‌లో ఒక ఫోర్ కొట్టడంతో పాటు ఇంకో రెండు పరుగులు తీసి ఈ సీజన్‌లో తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఆ వెంటనే మూడో బంతికి కూడా రెండో పరుగు తీయబోయి రనౌటయ్యాడు. దీంతో బెంగుళూరు చివరికి 163/5తో సరిపెట్టుకుంది.