మరికాసేపట్లో ఐపీఎల్ సందడి షురూ కానుంది. అబుదాబిలో చెన్నై, ముంబయి మధ్య తొలి మ్యాచ్. ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్ అంటే చాలు.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చెన్నైతో మ్యాచ్‌పై ముంబయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగిలిన ఫ్రాంచైజీల్లానే సీఎస్కే కూడా ఒకటని అన్నాడు. ముంబయి ఇండియన్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
-
🗣️: "It's the #ElClasico of @IPL!"#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #MIvCSK pic.twitter.com/i2TV6ump2U
— Mumbai Indians (@mipaltan) September 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">🗣️: "It's the #ElClasico of @IPL!"#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #MIvCSK pic.twitter.com/i2TV6ump2U
— Mumbai Indians (@mipaltan) September 18, 2020🗣️: "It's the #ElClasico of @IPL!"#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL #MIvCSK pic.twitter.com/i2TV6ump2U
— Mumbai Indians (@mipaltan) September 18, 2020
"సీఎస్కేకు వ్యతిరేకంగా ఆడటమంటే ఎప్పుడూ మజానే. ఆ పోటీని ఎంతో బాగా ఆస్వాదిస్తాం. అయితే, గేమ్ ఆడే సమయంలో మిగిలిన ప్రాంచైజీల్లాగే సీఎస్కే కూడా. అలానే మేం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం"
రోహిత్ శర్మ, ముంబయి కెప్టెన్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో చెన్నై, ముంబయి జట్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉటాయి. సీఎస్కే ఇప్పటివరకు మూడు సార్లు టైటిల్ గెల్చుకోగా, ముంబయి నాలుగు సార్లు ట్రోఫీ కైవసం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. బయో సెక్యూర్ విధానంలో ప్రేక్షకులు లేకుండానే జరగనుంది.