భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ సిరీస్‌కు మొత్తానికి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మోకాలి గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు జడేజా దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. మూడో వన్డే ఆడతాడా? లేదా? అన్నది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు.
తొలి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా ఇదే విషయంపై కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడాడు. 'ప్రస్తుతం జడేజా కొంత ఇబ్బందిగా ఉన్నాడు. అతడు ఫిట్‌గా ఉన్నాడో లేదో మాకు పూర్తిగా తెలియదు' అన్నాడు. అయితే యువ బౌలర్లు సంసిద్ధంగానే ఉన్నారని ధావన్ తెలిపాడు. 'ఫాస్ట్ బౌలింగ్‌లో సిరాజ్, ప్రసిధ్‌తో పాటు స్పిన్నర్లు అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్‌లతో మా బౌలింగ్ యూనిట్ పటిష్ఠంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు.
కెప్టెన్ రోహిత్, కోహ్లీ హార్దిక్, పంత్, షమి, బుమ్రా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీతో ధావన్ నాయకత్వంలో భారత కుర్రాళ్లు ఎలా ఆడతారో చూడాలి..!
ఇదీ చదవండి: 'విండీస్ సిరీస్‌కు విరాట్‌ను దూరం పెట్టడం వల్ల తప్పుడు సంకేతాలు'