India Vs West Indies Odi 2023 : వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా స్పిన్నర్లు చెలరేగిపోయారు. ఏడు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ ద్వయం ధాటికి విండీస్ కుప్పకూలింది. దీంతో కేవలం 23 ఓవర్లోనే వెస్టిండీస్ చేతులెత్తేసింది. జడేజా ఆరు ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ మూడు ఓవర్లలో కేవలం ఆరు పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ స్పిన్నర్లు అరుదైన ఘనత సాధించారు. ఇలా టీమ్ఇండియా తరఫున ఒక వన్డే మ్యాచ్‌లో 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్లుగా నిలిచారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
-
🚨 Milestone Alert 🚨#TeamIndia pair of @imkuldeep18 (4⃣/6⃣) & @imjadeja (3⃣/3⃣7⃣ ) becomes the first-ever pair of Indian left-arm spinners to scalp 7⃣ wickets or more in an ODI 🔝 #WIvIND pic.twitter.com/F18VBegnbJ
— BCCI (@BCCI) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🚨 Milestone Alert 🚨#TeamIndia pair of @imkuldeep18 (4⃣/6⃣) & @imjadeja (3⃣/3⃣7⃣ ) becomes the first-ever pair of Indian left-arm spinners to scalp 7⃣ wickets or more in an ODI 🔝 #WIvIND pic.twitter.com/F18VBegnbJ
— BCCI (@BCCI) July 27, 2023🚨 Milestone Alert 🚨#TeamIndia pair of @imkuldeep18 (4⃣/6⃣) & @imjadeja (3⃣/3⃣7⃣ ) becomes the first-ever pair of Indian left-arm spinners to scalp 7⃣ wickets or more in an ODI 🔝 #WIvIND pic.twitter.com/F18VBegnbJ
— BCCI (@BCCI) July 27, 2023
ఈ ఘనతపై కుల్‌దీప్ ఆనందం వ్యక్తం చేశారు. 'వెస్టిండీస్ పిచ్‌లు సీమర్లకు అనుకూలంగా ఉంటాయి. అలాంటి మైదానంలో మేమిద్దరం 7 వికెట్లు పడగొట్టడం ఆనందంగా ఉంది. ఈ పిచ్‌పై బౌన్స్‌తోపాటు బంతి తిరగడం మాకు కలిసొచ్చింది. నేను నా రిథమ్ మీద దృష్టిపెట్టి సాధన చేశాను. సరైన ప్రాంతంలో సంధించడం వల్ల నాకు వికెట్లు లభించాయి. ఈ మ్యాచ్‌లో చాహల్ బరిలోకి దిగకపోయినా.. అతడు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి. పేసర్లు ముకేశ్ కుమార్, శార్దూల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆ తర్వాత జడేజాతో కలిసి నేను విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించాను. పరిస్థితికి తగ్గట్టుగా గూగ్లీలను సంధించి వికెట్లను రాబట్టాను. లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు అతడికి దూరంగా బంతులను వేయడానికి ప్రయత్నించి సఫలమయ్యా' అని చెప్పాడు.
India Tour Of West Indies 2023 : ఇక ఈ మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. విండీస్ నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఐదు వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం విశేషం. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.