ETV Bharat / sports

లంకతో రెండో వన్డే నేడే.. మరో భారీ విజయంపై భారత్​ కన్ను.. ఏం జరుగుతుందో? - భారత్​ వర్సెస్​ శ్రీలంక షెడ్యూల్​

ఆరంభ పోరులో భారీ విజయం విశ్వాసాన్ని పెంచుతుంటే, టాప్‌-3 బ్యాటర్ల సూపర్‌ ఫామ్‌ ఉత్సాహాన్నిస్తుంటే టీమ్‌ఇండియా మరో పోరాటానికి సిద్ధమైంది. శ్రీలంకతో రెండో వన్డే నేడు. ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్న రోహిత్‌సేనను అడ్డుకోవడం లంకేయులకు సవాలే.

team india
India Vs Srilanka 2nd odi
author img

By

Published : Jan 12, 2023, 6:26 AM IST

జోరుమీదున్న టీమ్‌ఇండియా గురువారం జరిగే రెండో వన్డేలో శ్రీలంకతో తలపడనుంది. బ్యాటర్లు చెలరేగడంతో తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో జట్టు అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తొలి ముగ్గురు బ్యాటర్లు మరోసారి సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. విరాట్‌ కోహ్లి ఫామ్‌ టీమ్‌ఇండియాకు పెద్ద సానుకూలాంశం. బ్యాటుతో అదరగొట్టిన కోహ్లి కెరీర్‌లో 73వ అంతర్జాతీయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో అతడు పూర్తి నియంత్రణతో బ్యాటింగ్‌ చేశాడు.

ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన కెప్టెన్‌ రోహిత్‌ తన మ్యాచ్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలను పటాపంచలు చేశాడు. ఇప్పుడు తన ఫేవరెట్‌ మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో చెలరేగేందుకు ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. ఎనిమిదేళ్ల కింద భారత్‌, లంక జట్లు చివరిసారి ఇక్కడ తలపడప్పుడు రోహిత్‌ ప్రపంచ రికార్డు స్కోరు (264) సాధించాడు. ఈసారి కూడా అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి.

చివరిసారి 2020 జనవరిలో వన్డే సెంచరీ (ఆస్ట్రేలియాపై) సాధించిన రోహిత్‌, ఈడెన్‌లోనైనా కరవు తీర్చుకుంటాడో లేదో చూడాలి. మరోవైపు యువ ఓపెనర్‌ శుభమ్‌న్‌ గిల్‌ చక్కని వన్డే ఫామ్‌ను కొనసాగిస్తుండడంతో భారత్‌ టాప్‌ ఆర్డర్‌ కుదురుకున్నట్లే కనిపిస్తోంది. ఇషాన్‌ కిషన్‌ అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో కేఎల్‌ రాహులే పుంజుకోవాల్సివుంది. బంతితోనూ భారత్‌ ధీమాగానే కనిపిస్తోంది. పేసర్‌ సిరాజ్‌.. షమి, ఉమ్రాన్‌ మాలిక్‌లతో కలిసి మరోసారి లంక బ్యాటర్లకు సమస్యలు సృష్టిస్తాడని జట్టు ఆశిస్తోంది. భారత్‌ ఎలాంటి మార్పులు లేకుండా రెండో వన్డేలో బరిలోకి దిగే అవకాశముంది.

శ్రీలంక పోటీ ఇచ్చేనా?: రెట్టించిన విశ్వాసంతో ఉన్న టీమ్‌ఇండియాను అడ్డుకోవాలంటే శ్రీలంక అసాధారణంగా పుంజుకోవాల్సిందే. కెప్టెన్‌ శానక బ్యాటింగ్‌ ఒక్కటే ఆ జట్టుకు ఊరట. సెంచరీతో ఆకట్టుకున్న అతడు ఫామ్‌ను కొనసాగించాలని లంక కోరుకుంటోంది. ఓపెనర్‌ నిశాంక కూడా ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో బ్యాటుతో బలమైన ప్రదర్శన చేయొచ్చని ఆ జట్టు భావిస్తోంది. అయితే లంకకు పెద్ద ప్రతికూలాంశం ఫీల్డింగే. తొలి వన్డేలో కోహ్లి క్యాచ్‌లు రెండు వదిలేసి మూల్యం చెల్లించుకుంది.

పిచ్‌..
మ్యాచ్‌ వేదిక ఈడెన్‌ గార్డెన్స్‌ చివరిసారి వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చి అయిదేళ్లు దాటిపోయింది. చివరగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 252 పరుగులకు ఆలౌట్‌కాగా.. ఆసీస్‌ 202 పరుగులే చేసింది.

3.. 2010 ఆరంభం నుంచి సొంతగడ్డపై 24 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడిన భారత్‌.. మూడింటిని మాత్రమే చేజార్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.