ETV Bharat / sports

World Cup 2023 : అతిపెద్ద స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్​ వరల్డ్​ కప్​ మ్యాచ్​ - నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్ పాక్​ మ్యాచ్​

India vs Pakistan World Cup 2023 : ఈ ఏడాది భారత్​ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్​ ​షెడ్యూల్​ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఐపీఎల్ అయిపోయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మెగా టోర్నీలో ఉత్కంఠ రేపే భారత్​, పాకిస్థాన్​ మ్యాచ్​ జరిగే వేదికను బీసీసీఐ దాదాపు ఖరారు చేసింది. అది ఎక్కడో తెలుసా?

WC 2023 Ind vs Pak
WC 2023 Ind vs Pak
author img

By

Published : May 5, 2023, 7:04 PM IST

India vs Pakistan World Cup 2023 : భారత్​ పాకిస్థాన్​ మధ్య పోరును క్రికెట్ ఆట​లోనే హై వోల్టేజ్​ మ్యాచ్​గా పరిగణిస్తారు. ఈ ఇరు జట్లు రాబోయే ప్రపంచకప్​లో పోటీ పడనున్న నేపథ్యంలో.. త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారికంగా మ్యాచ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా అక్టోబర్ 7 ఆదివారం రోజున భారత్​ పాక్​ మ్యాచ్​ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగి ఉండటం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కావటం వల్ల బోర్డు ఉన్నతాధికారులు నరేంద్రమోదీ స్టేడియాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి షెడ్యూల్​ రానుంది.
India vs Pakistan World Cup 2023 venue : ఈ దాయాదుల మ్యాచ్​కు నరేంద్ర మోదీ స్టేడియం ఫైనలైజ్​ అయితే అభిమానులకు పండగే. లక్ష మంది ప్రేక్షకులు స్వయంగా స్టేడియంలో మ్యాచ్​ వీక్షించవచ్చు.
World Cup 2023 India Venues : ఆహ్మదాబాద్​తో పాటు హైదరాబాద్, చెన్నై, దిల్లీ, బెంగళూరు, కోల్​కతా, లఖ్​నవూ, ఇందౌర్, రాజ్​కోట్​, ముంబయి, గువాహటి వేదికల్లో ప్రపంచకప్​ నిర్వహించనున్నారు. మొత్తం టోర్నీలో 48 మ్యాచ్​లు జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్​లకు కేవలం ఏడు మైదానాలే వేదిక కానున్నాయి.

దాయాది పాకిస్థాన్​ ప్రపంచకప్​లో తమ మ్యాచ్‌లను కోల్‌కతా‌, బెంగళూరు, చెన్నైలో... బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను​ కోల్‌కతా, గువాహటి వేదికగానే ఆడనున్నాయి. భద్రత కారణాల దృష్యా పాక్​, బంగ్లాదేశ్​ మ్యాచ్​లను ఈ వేదికలకే పరిమితం చేసినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.

గతంలో భారత్ ఆతిథ్యం...
ఇదివరకు వన్డే ప్రపంచకప్​నకు భారత్​ మూడు సార్లు ఆతిథ్యమిచ్చింది. అయితే 1987లో పాకిస్థాన్​తో, 1996లో పాక్, శ్రీలంకలతో కలిసి సంయుక్తంగా వేదికను పంచుకుంది. తాజాగా 2011లో బంగ్లాదేశ్, శ్రీలంక​లతో కలసి ప్రపంచకప్​నకు ఆతిథ్యమిచ్చింది. ఆ సంవత్సరం మహేంద్ర సింగ్​ ధోని కెప్టెన్సీలో భారత్​ ఫైనల్​లో శ్రీలంకపై ఉత్కంఠ పోరులో గెలిచి ఛాంపియన్​​గా నిలిచింది. ఈ సంవత్సరం మాత్రం మ్యాచ్​లన్నీ పూర్తిగా భారత్​లోనే నిర్వహించనున్నారు.

ఐసీసీ ఈవెంట్స్​లో ఎవరిది పైచేయి..
భారత్​, పాకిస్థాన్ వన్డే ప్రపంచ కప్​లో 7 సార్లు తలపడితే ఏడింట్లోనూ భారత్​ జయకేతనం ఎగురవేసింది. టీ20 వరల్డ్​ కప్​లో కూడా ఇరు జట్ల మధ్య ఏడు సార్లు మ్యాచ్​ జరగగా... భారత్ 5 సార్లు, పాక్​ ఒకసారి గెలిచింది. ఒక మ్యాచ్​లో ఫలితం రాలేదు. ఈ రెండు ఐసీసీ ఈవెంట్స్​లో పాకిస్థాన్ మీద ​పై చేయి సాధించిన భారత్​ ఛాంపియన్స్​ ట్రోఫీలో మాత్రం సత్తా చాటలేకపోయింది. రెండు జట్లు ఛాంపియన్స్​ ట్రోఫీలో ఐదు సార్లు ఎదురుపడ్డాయి. రెండిటిలో భారత్​ నెగ్గింది. పాకిస్థాన్ మూడింట్లో విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.