భారత్‌తో సిరీస్(IND vs NZ T20 series) నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్.. టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ కూడా అదే దారిలో వెళ్లాడు. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవడం కోసం ఈ సిరీస్‌కు దూరమవుతున్నట్లు తెలిపాడు. అయితే.. తమ ప్రణాళికలో భాగంగా జేమిసన్‌ను టీ20 సిరీస్‌కు దూరం చేసినట్లు కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు.
"కేన్ విలియమ్సన్, కైల్ జేమీసన్తో మాట్లాడాకే టీ20 సిరీస్‌లో వారికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వారు టెస్టు సిరీస్ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నారు. టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్న మరికొంత మంది యువ ఆటగాళ్లు కూడా టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది. వెంటవెంటనే పలు కీలక సిరీస్ ఉండటం వల్ల ఇలా చేస్తున్నాం." అని గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు.
భారత్, కివీస్ మధ్య టీ20 సిరీస్ నవంబర్ 17-21 మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ జైపూర్(నవంబర్ 17), రెండో మ్యాచ్ రాంచీ(నవంబర్ 19), మూడో మ్యాచ్ కోల్‌కతా(నవంబర్ 21) వేదికగా జరగనున్నాయి. అనంతరం భారత్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది కివీస్. నవంబర్ 25-29 మధ్య కాన్పుర్‌లో తొలి టెస్టు, డిసెంబర్ 3-7 మధ్య ముంబయి వేదికగా రెండో టెస్టు జరగనుంది.
నేడు(నవంబర్ 17) జరగనున్న తొలి మ్యాచ్‌లో కివీస్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది టీమ్ఇండియా. టీ20 కెప్టెన్ పగ్గాలు చేపట్టాక రోహిత్‌కు ఇదే తొలి మ్యాచ్ కాగా, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానాన్ని ఈ మ్యాచ్‌తోనే ప్రారంభించనున్నాడు.
ఇదీ చదవండి:
Ind vs NZ: భారత్-కివీస్ టీ20 సిరీస్- ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా?
ind vs nz preview: భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్.. గెట్ రెడీ