India vs England Women : ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సరీస్‌ను భారత్ మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. జులన్ గోస్వామి ఆఖరి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. ఆమెకు ఘన వీడ్కోలు పలికింది. అయితే ఈ మ్యాచ్ మరో వివాదానికి వేదికైంది. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్.. బంతి వేయకుండానే క్రీజు వదిలి ముందుకు వెళ్లడాన్ని గమనించిన భారత బౌలర్ దీప్తి.. ఆమెను రనౌట్ చేసింది. దీంతో ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కీలక సమయంలో వికెట్ తీసి భారత్‌ను గెలిపించిన దీప్తిపై భారత్‌లో ప్రశంసలు కురుస్తుండగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం 'ఇది తొండి' అంటూ వాదనకు దిగారు.
మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 45.4 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ సైతం ఇబ్బందులు పడింది. 118 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఛార్లీ డీన్ (47).. చివరి ఇద్దరు బ్యాటర్లతో కలిసి పోరాడి జట్టును విజయానికి చేరువ చేసింది. 17 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలుస్తుందనగా డీన్‌ను దీప్తిశర్మ నాన్ స్ట్రైక్‌లో రనౌట్ చేసి భారత్‌ను గెలిపించింది.
-
When it is in the rules where is the hell sportsman spirit comes from? .#DeeptiSharma did the perfect things rules are rules even for fools. Ghore rone lagenge 😂. Great to see #HarmanpreetKaur saying it out loud and clear.#JhulanGoswami #indwvsengw #SmritiMandhana #India #BCCI pic.twitter.com/jxCUI2c2VQ
— Venkatesh M (@Venkiispeaks) September 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">When it is in the rules where is the hell sportsman spirit comes from? .#DeeptiSharma did the perfect things rules are rules even for fools. Ghore rone lagenge 😂. Great to see #HarmanpreetKaur saying it out loud and clear.#JhulanGoswami #indwvsengw #SmritiMandhana #India #BCCI pic.twitter.com/jxCUI2c2VQ
— Venkatesh M (@Venkiispeaks) September 24, 2022When it is in the rules where is the hell sportsman spirit comes from? .#DeeptiSharma did the perfect things rules are rules even for fools. Ghore rone lagenge 😂. Great to see #HarmanpreetKaur saying it out loud and clear.#JhulanGoswami #indwvsengw #SmritiMandhana #India #BCCI pic.twitter.com/jxCUI2c2VQ
— Venkatesh M (@Venkiispeaks) September 24, 2022
కాగా, ఈ విషయంపై మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్కాన్ఫరెన్స్లోనే హర్మన్ స్పందించింది. ఈ రనౌట్ చేసిన దీప్తికి అండగా ఉంటామని చెప్పింది. "ఈ రోజు మేము చేసింది తప్పుకాదు. అది ఆటలో భాగమే. ఐసీసీ రూల్స్ ప్రకారమే మేము ఆడాం. అయినా మా ప్లేయర్‌కు సపోర్టుగా నిలవడం మాకు అవసరం. రూల్స్ గుర్తుంచుకొని ఈ రనౌట్ చేసిన దీప్తిని చూస్తే సంతోషంగా ఉంది. ఆమె తప్పు చేసింది అని అనుకోను" అని పేర్కొంది. "మేము చేసిన పరుగులు తక్కువే. ఛేజ్ చేయగలిగేవే. కానీ మా బౌలర్లు బాగా ఆడారు. టీమ్ అంతా కలిసికట్టుగా శ్రమించాము. అయితే లాస్ట్ వికెట్ గురించి కాకుండా ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉంది" అని చెప్పింది హర్మన్ ప్రీత్.
పదేపదే అదే ప్రశ్న..
అయితే, అవార్డ్ ప్రెజెంట్ చేసేటప్పుడు అంత చారిత్రాత్మక విజయం, టీమ్ ఇండియా అద్భుతమైన విజయం గురించి కాకుండా.. హర్మన్‌ను పదే పదే రన్ ఔట్ గురించే అడిగాడు ప్రెజెంటర్. అలా అడగడం హర్మన్‌కు చిరాకు తెప్పించింది. దానిపై స్పందిస్తూ.. "నిజం చెప్పాలంటే మీరు ఆ ఒక్క వికెట్ గురించి కాకుండా మిగతా 9 వికెట్ల గురించి అడగాలి. ఎందుకంటే ఆ 9 వికెట్లు తీయడం కూడా తక్కువ విషయం ఏం కాదు. అయినా మ్యాచ్‌లో కొత్తగా మేము ఏం చేయలేదు. ఆ టైమ్‌లో అలా ఔట్ చేయాలనే అవగాహన ఉండటం మంచింది" అని సమాధానమిచ్చింది.
"నేను మా ప్లేయర్లకు సపోర్ట్ చేస్తా. ఎందుకంటే వారు రూల్స్‌కు అతీతంగా ఏమీ చేయలేదు. మ్యాచ్‌కు ముందు మేము బాగా ఆడాలని చర్చించుకున్నాం. అలా ఆడగల సత్తా మాకు ఉంది. ఇలాంటి ఆటను ఇంకా మున్ముందు కూడా ఆడతాం" అని కౌంటర్ ఇచ్చింది హర్మన్. ఇంతకుముందు జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టుకు కూడా అలాంటి ఘటనే జరిగిందని హర్మన్ చెప్పింది.
'లేదంటే గెలిచేవాళ్లం'
డీన్ రనౌట్ తనను అసంతృప్తికి గురిచేసిందని ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ కేట్ క్రాస్ చెప్పుకొచ్చింది. "మ్యాచ్‌లో ఒక వికెట్ పడిపోయినా డిసప్పాయింట్ అవుతాం. దీప్తి అలా నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము మ్యాచ్ ఓడిపోయాం. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన తర్వాత ఆ ఒక్క వికెట్ ఉంటే మేము మ్యాచ్ గెలిచేవాళ్లం అనుకుంటాం" అని క్రాస్ అభిప్రాయపడింది.
దీప్తి చేసిన రనౌట్ పూర్తిగా లీగల్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్ అభిమానులు ఇది అనైతికం అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవలే మన్కడింగ్‌ను 'అన్ఫేయిర్ ప్లే' నుంచి రనౌట్‌కు మార్చింది ఐసీసీ. దీంతో డీన్ రనౌట్ న్యాయబద్ధంగానే జరిగిందని భారత అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రూల్ ప్రకారం రనౌట్ చేసినా.. అనైతికం అని అనడం సరికాదని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి : టీమ్ ఇండియాను వీడని సమస్యలు.. హైదరాబాద్‌లో గట్టెక్కేనా..?
జులన్‌కు ఘనంగా వీడ్కోలు.. ఇంగ్లాండ్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్