ETV Bharat / sports

India vs England: గెలిస్తే అరుదైన ఘనత.. రీషెడ్యూల్​ టెస్టు ప్రత్యేకతలివే! - టీమ్​ఇండియా

గతేడాది ఇండియా-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో కరోనా కారణంగా రీషెడ్యూల్​ అయిన ఆఖరి మ్యాచ్​ ఎడ్జ్​బాస్టన్​ వేదికగా శుక్రవారమే ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​. అయితే సిరీస్​లో భారత్​ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్​ కీలకంగా మారింది. అప్పటికీ ఇప్పటికీ రెండు జట్లకు కెప్టెన్లు మారారు. అప్పుడు ఆడిన చాలా మంది ఇప్పుడు ఆయా తుది జట్లలో లేరు. ఈ మ్యాచ్​కు ముందు కొన్ని ఆసక్తికర​ విషయాలు తెలుసుకోండి.

india vs england
india vs england test 2022
author img

By

Published : Jul 1, 2022, 11:57 AM IST

గతేడాది ఇంగ్లాండ్​తో సిరీస్​లో టీమ్​ ఇండియా ఎలా చెలరేగిందో తెలిసే ఉంటుంది. ఆడిన నాలుగు టెస్టుల్లో రెండింట్లో గెలిచి, ఒకటి ఓడింది. మరో మ్యాచ్​ డ్రాగా ముగిసింది. 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అదే ఊపులో చివరి టెస్టు గెలిచి చారిత్రక సిరీస్​ గెలుస్తుందనుకున్న తరుణంలో కరోనా కలకలం రేపింది. సిరీస్​ తాత్కాలికంగా నిలిచిపోయింది. అప్పుడు నిర్వహించాల్సిన ఐదో టెస్టును రీషెడ్యూల్​ చేశారు. ఆ మ్యాచ్​ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

india vs england
టీమ్​ఇండియా

ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ గెలిస్తే.. సిరీస్​ సమం అవుతుంది. ఇండియా గెలిచినా, డ్రా చేసుకున్నా.. చారిత్రక సిరీస్​ మన సొంతమే అవుతుంది. అప్పటికీ ఇప్పటికీ ఇరు జట్లలో చాలా మార్పులు వచ్చాయి. వాటితో పాటు ఈ మ్యాచ్​కు ఉన్న విశేషాలు ఏంటంటే..

  • గతేడాది జరిగిన సిరీస్​లో ఇంగ్లాండ్​ టెస్టు కెప్టెన్​గా జో రూట్​.. కోచ్​గా సిల్వర్​ వుడ్ ఉండగా.. టీమ్​ ఇండియా కెప్టెన్​గా విరాట్​ కోహ్లీ.. కోచ్​గా రవిశాస్త్రి ఉండేవారు. ఇప్పుడు మొత్తం తారుమారైంది. ప్రస్తుతం ఇంగ్లాండ్​ కెప్టెన్​గా బెన్​ స్టోక్స్​, కోచ్​గా బ్రెండన్​ మెక్​కల్లమ్​.. టీమ్​ఇండియా కెప్టెన్​గా రోహిత్​ శర్మ(కరోనాతో దూరమైన తర్వాత.. బుమ్రాను నియమించారు), కోచ్​గా రాహుల్​ ద్రవిడ్​ బాధ్యతల్లో ఉన్నారు.
  • 2007 తర్వాత.. ఇంగ్లాండ్​పై ఇంగ్లాండ్​లో ద్వైపాక్షిక టెస్టు సిరీస్​ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం టీమ్​ ఇండియాకు ఉంది. చివరి టెస్టులో గెలిచినా, డ్రా చేసుకున్నా ఇది సాధ్యం అవుతుంది.
    india vs england
    ఇంగ్లాండ్
  • ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్​ వరుసగా మూడు టెస్టులు గెలిచి జోరు మీద ఉంది. అంతకుముందు ఒక్కసారే 3 అంతకన్నా ఎక్కువ మ్యాచ్​లు వరుసగా గెలిచింది ఆతిథ్య జట్టు. అదీ 2014,15ల్లో ఇండియాపై 4 మ్యాచ్​ల్లో వరుసగా గెలిచింది.
  • చివరి టెస్టుల్లో ఇండియా గెలిస్తే.. విదేశాల్లో మన అత్యధిక టెస్టు విజయాలు ఇంగ్లాండ్​పైనే ఉండనున్నాయి. ఇప్పటివరకు భారత్​.. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా, వెస్టిండీస్​, శ్రీలంకల్లో 9 మ్యాచ్​ల చొప్పున గెలిచాయి. అయితే.. ఈ నాలుగు దేశాల్లో భారత విజయాల శాతం ఇంగ్లాండ్​లోనే తక్కువగా ఉండటం గమనార్హం. అక్కడ 67 టెస్టులాడితే 9 మ్యాచ్​ల్లోనే టీమ్​ ఇండియా గెలిచింది.
  • భారత్ చివరి టెస్టు​ ఆడుతున్న బర్మింగ్​హామ్​లో టీమ్​ ఇండియా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్​ కూడా గెలవలేదు. మొత్తం 7 ఆడగా.. ఒకటి డ్రా చేసుకొని, ఆరింట్లో ఓడింది. ఇంగ్లాండ్​లో భారత్​ 5 టెస్టుల కంటే ఎక్కువ ఆడి ఓడిపోయిన వేదికల్లో మరోటి ఓల్డ్​ ట్రాఫోర్డ్​ మాత్రమే. అక్కడ 9 ఆడి.. నాలుగు ఓడిపోయింది. 5 మ్యాచ్​లు డ్రా చేసుకుంది.
  • భారత్​ విదేశాల్లో చివరిగా ఆడిన రెండు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అంతకుముందు చివరకు ఇలా 2020లోనే జరిగింది.
    india vs england
    కోహ్లీ
  • పురుషుల టెస్టు క్రికెట్​లో 2020 నుంచి.. మొత్తం పరుగుల్లో బౌండరీల ద్వారా సాధించిన రన్స్​లో (53 శాతం) ఇండియా టాప్​లో ఉంది. 49 శాతంతో ఇంగ్లాండ్​ ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉంది.
  • ఇంగ్లాండ్​ క్రికెటర్​ జానీ బెయిర్​స్టో.. తాను ఆడిన చివరి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించాడు. అంతకుముందు ఒక్కసారే ఇలా చేశాడు. అది కూడా ఈ ఏడాదే కావడం విశేషం. 2022లో 64.5 సగటుతో 774 పరుగులతో ఉన్నాడు. ఒక ఏడాదిలో ఇన్ని పరుగులు చేయడం అతడికి రెండో అత్యధికం. 2016లో మొత్తం 1470 రన్స్​ చేశాడు బెయిర్​స్టో.
  • మరో 5 వికెట్లు తీస్తే.. బర్మింగ్​హామ్​లో 50 వికెట్ల ఘనతను సొంతం చేసుకుంటాడు ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​. అంతకుముందు లార్డ్స్​(116), ట్రెంట్​ బ్రిడ్జ్​ (73) వేదికల్లోనూ 50కిపైగా వికెట్ల చొప్పున తీశాడు.
    india vs england
    ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా
  • మరో 69 పరుగులు చేస్తే పురుషుల టెస్టు క్రికెట్​లో.. 3000 పరుగులు, 100 వికెట్లు సాధించిన మూడో భారతీయుడిగా నిలుస్తాడు రవిచంద్రన్​ అశ్విన్​. ఇంగ్లాండ్​పైనా అత్యధిక టెస్టు వికెట్ల వీరుడిగా నిలిచేందుకు కూడా మరో 8 వికెట్లు తీస్తే చాలు. ఈ జాబితాలో బీఎస్​ చంద్రశేఖర్​-95, అనిల్​ కుంబ్లే-92 తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
  • ఇంగ్లాండ్​పై టెస్టు క్రికెట్​లో 50 వికెట్లు సాధించిన తొమ్మిదో భారత బౌలర్​గా నిలిచేందుకు మహ్మద్​ షమీకి మరో 8 వికెట్లు అవసరం. విదేశాల్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్​గా నిలిచేందుకు 6 వికెట్లు తీస్తే చాలు. ప్రస్తుతం విదేశాల్లో 147 వికెట్లు తీసిన షమీ.. హర్భజన్​ను(152) దాటే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​ 2.0తో బుమ్రా సేన ఢీ.. గెలిస్తే చరిత్రే.. కానీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.