India vs Bangladesh World Cup 2023 : 2023 వన్డే వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో టీమ్ఇండియా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. నాలుగో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. 3 వికెట్లు కోల్పోయి 41.3 ఓవర్లలో 261 పరుగులు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (103*; 97 బంతుల్లో 6x4, 4x6) విజృంభించాడు.
-
India chase down the Bangladesh total with 51 balls to spare for their fourth successive #CWC23 win ⚡#INDvBAN 📝: https://t.co/v3xome9pao pic.twitter.com/m1YC2onskd
— ICC Cricket World Cup (@cricketworldcup) October 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">India chase down the Bangladesh total with 51 balls to spare for their fourth successive #CWC23 win ⚡#INDvBAN 📝: https://t.co/v3xome9pao pic.twitter.com/m1YC2onskd
— ICC Cricket World Cup (@cricketworldcup) October 19, 2023India chase down the Bangladesh total with 51 balls to spare for their fourth successive #CWC23 win ⚡#INDvBAN 📝: https://t.co/v3xome9pao pic.twitter.com/m1YC2onskd
— ICC Cricket World Cup (@cricketworldcup) October 19, 2023
సిక్సర్‌తో ఫినిష్..
చివర్లో సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. భారత్‌కు భారీ విజయాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్ (53; 55 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ (48; 40 బంతుల్లో 7x4, 2x6) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (19; 25 బంతుల్లో 2x4) ఫర్వాలేదనిపించాడు. కేఎల్ రాహుల్ (34*; 34 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్ రెండు వికెట్లు పడగొట్టగా, హసన్ మహ్మద్ ఒక వికెట్ తీశాడు.
అంతకుముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తాంజిద్ హసన్ (51; 43 బంతుల్లో 5x4, 3x6), లిట్టన్ దాస్ (66; 82 బంతుల్లో 7x4) అద్భుత ప్రదర్శన చేశారు. ఆ తర్వాత వచ్చిన నజ్ముల్ శాంటో (8), మెహదీ హసన్ మిరాజ్ (3) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔట్ అయి పెవిలియన్ చేరారు. తౌహిద్ హృదోయ్ (16), నసుమ్ అహ్మద్ (14) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ముష్ఫీకర్ రహీమ్ (38; 46 బంతుల్లో) రాణించాడు. చివర్లో మహ్మదుల్లా (46; 36 బంతుల్లో 3x4, 3x6) దూకుడుగా ఆడాడు. టీమ్ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా రెండు చొప్పున వికెట్ల పడగొట్టారు. శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.
సచిన్ 49, కోహ్లీ 48.. అడుగు దూరంలో రికార్డ్..
Kohli Odi Centuries : తాజా సెంచరీతో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ ఫార్మాట్లో 25వేలకు పైగా పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. అత్యంత వేగంగా 25 వేల పరుగులు చేసిన బ్యాటర్ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. వన్డేలలో కోహ్లీకి ఇది 48వ సెంచరీ. ఈ ఫార్మాట్లో సచిన్ 49 శతకాలు కొట్టగా.. ఆ రికార్డుకు కోహ్లీ అడుగు దూరంలో ఉన్నాడు.
Ind Vs Ban World Cup 2023 : జడేజా, బుమ్రా మెరుపులు.. ఆరేళ్ల తర్వాత విరాట్ అలా..