ETV Bharat / sports

India Vs Australia ODI 2023 : ఆ ముగ్గురు బ్యాటర్లు విశ్వరూపం చూపిస్తే పరుగుల వరదే.. ఏం చేస్తారో?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 11:01 AM IST

India Vs Australia ODI 2023 : మొహాలీ వేదికగా జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్​ శుక్రవారం ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్‌ ముందు ఈ సిరీస్‌ ఇరు జట్లకు ప్రాక్టీస్‌గా ఉపయోగపడనున్న ఈ సిరీస్​లో అత్యధిక పరుగులు చేసే అవకాశం ఉన్న బ్యాటర్లు ఎవరన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆ లిస్ట్​లో ట్రెండింగ్​లో ఉన్న ప్లేయర్స్​ ఎవరంటే ?

India Vs Australia ODI 2023
India Vs Australia ODI 2023

India Vs Australia ODI 2023 : వన్డే ప్రపంచకప్​కు ముందు ఆస్ట్రేలియాతో టీమ్​ఇండియా మూడు వన్డే సిరీస్​ తలపడనుంది. కేఎల్​ రాహుల్ సారథ్యం వహిస్తున్న ఈ జట్టు భారత్​లోనీ మూడు వేదికల్లో కంగారు జట్టుతో పోటీ పడనుంది. అయితే మేటి ప్లేయర్లు ఉన్న ఇరు జట్లలో.. రానున్న మూడు వన్డే సిరీస్​కుగానూ అత్యధిక పరుగులు చేసే అవకాశం ఉన్న బ్యాటర్లు ఎవరన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆ లిస్ట్​లో ట్రెండింగ్​లో ఉన్న ప్లేయర్స్​ ఎవరంటే ?

శుభ్‌మన్ గిల్: ఆసియా కప్ ప్రారంభమయ్యే ముందు గిల్ ఫామ్‌పై పలు సందేహాలు తలెత్తాయి. విండీస్​తో జరిగిన పోరులో కూడా అతను పెద్దగా రాణించకపోవడం వల్ల అభిమానులు నిరుత్సహానికి లోనయ్యారు. అయితే ఆసియా కప్‌లో ఆ ప్రశ్నలన్నింటికీ చెక్​ పెట్టాడు గిల్​. తన అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన గిల్​.. రోహిత్‌తో కలిసి టీమ్ఇండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. ఆ టోర్నీలో ఏకంగా 75.5 సగటుతో 302 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను టాప్ స్కోరర్‌గా కూడా రికార్డుకెక్కాడు. అలా ఈ ఆసీస్ సిరీస్​లో కూడా అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ల జాబితాలో గిల్ ముందు వరుసలో ఉన్నాడు.

స్టీవ్ స్మిత్ : మణికట్టుకు గాయమవ్వడం వల్ల సౌతాఫ్రికా సిరీసుకు దూరమైన స్టీవ్ స్మిత్.. తాజాగా కోలుకుని తన బెస్ట్​ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాడు. తన రీఎంట్రీతో మెరుపులు అందించేందుకు సిద్ధంగా ఉన్న స్మిత్​.. వరల్డ్ కప్ ముందు ఫామ్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే మిచెల్​ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్‌లను నెట్స్‌లో రెండు గంటలపాటు ఎదుర్కొన్న స్మిత్ .. రానున్న మ్యాచ్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. భారత్‌లో మంచి రికార్డు ఉన్న ఈ స్టార్​ ప్లేయర్​.. ఈ మూడు వన్డేల్లో కూడా అదరగొట్టాలంటూ ఆసీస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కేఎల్ రాహుల్ : గాయాలతో పోరాడి కోలుకున్న టీమ్​ఇండియా ప్లేయర్​ కేఎల్​ రాహుల్​.. తాజాగా జరిగిన ఆసియా కప్​లో శతకాలతో చెలరేగిపోయాడు. పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కీలక ఇన్నింగ్స్​ ఆడిన రాహుల్​.. జట్టుకు మంచి స్కోర్​ను అందించాడు. ఇలా తమ కమబ్యాక్​తో అందరిని అబ్బురపరిచిన అతను.. ఆసీస్‌తో జరగనున్న సిరీస్​లో భారత జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఓ బ్యాటర్​గానే కాకుండా ఓ సారథిగా అతనిపై అదనపు భారం పడింది.

ఇక వరల్డ్ కప్‌ జట్టులో కూడా కీలకమైన ఈ స్టార్ బ్యాటర్​.. తన ఆసియా కప్ ఫామ్‌ను రానున్న మ్యాచ్​లకు కొనసాగించేందుకు రెడీగా ఉన్నాడు. కెప్టెన్‌గా కూడా బాధ్యతలు చేపట్టిన అతను.. మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అదే గనుక జరిగితే అతను ఈ సిరీస్​లో భారీ ఇన్నింగ్స్​ ఆడటం ఖాయమంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tilak Varma World Cup 2023 : హోల్డ్ ఆన్.. మనోడు ఇంకా ప్రపంచకప్​ రేసులోనే.. సమీకరణాలు ఇవే!

Ind Vs Aus ODI : భారత్ - ఆస్ట్రేలియా తొలి వన్డే.. రికార్డుల వేటలో రాహుల్​, అశ్విన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.