ETV Bharat / sports

టీమ్ ఇండియాలో ​కీలక మార్పులు.. ఆ ముగ్గురు ఇన్​.. వీళ్లు ఔట్​! - టీ20 లేటస్ట్​ అప్టేట్స్

India Vs Australia : సెప్టెంబర్ 20న ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్​లో భారత్​ ఓటమి పాలైంది. భారత్‌ 208 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆసీస్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో రెెండో మ్యాచ్​లో గెలిచి పోటీలో ఉండాలని ప్రణాళికలు రచిస్తోంది టీమ్ ఇండియా.

ind-vs-aus-3-changes-india-can-make-for-2nd-t20

author img

By

Published : Sep 22, 2022, 10:35 AM IST

India Vs Australia : మూడు టీ20ల సిరీస్​లో భాగంగా సెప్టెంబర్ 20న జరిగిన మొదటి మ్యాచ్​లో ఆస్ట్రేలియా-భారత్​ తలపడ్డాయి. భారత్​ జట్టును కంగారుల జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. భారత్‌ 208 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ ఈ స్కోరును ఛేదించింది. దీంతో ఈ నెల 23న ఆసీస్‌తో జరిగే రెండో మ్యాచ్​లో గెలిచి పోటీలో ఉండాలని టీమ్ ఇండియా చూస్తోంది. దీని కోసం మరిన్ని వ్యూహాత్మక మార్పులతో ముందుకు రానున్నట్లు సమాచారం.

1. ఉమేష్ యాదవ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా
జస్ప్రీత్ బుమ్రాకు మొదటి మ్యాచ్​లో కాస్త విశ్రాంతి దొరికింది. దీంతో రోహిత్ సేన పవర్‌ప్లేలో ప్రత్యర్థిని దెబ్బతీయలేకపోయారు. అదేకాకుండా ఇన్నింగ్స్ చివర్లోనూ పట్టు సాధించలేకపోయారు. ఇప్పుడు ఉమేష్​ స్థానంలో బుమ్రా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. డెత్​ ఓవర్​లో బౌలింగ్​ వేసే వారిలో బుమ్రా మేటి అని కిక్రెట్​ అభిమానులు అంటుంటారు. 58 టీ20 మ్యాచ్‌లాడిన బుమ్రా.. 6.46 ఎకానమీతో 69 వికెట్లు తీశాడు

2. అక్సర్​ ప్లేస్​లో దినేశ్​ కార్తిక్
గత మ్యాచ్‌లో దినేశ్​ కార్తీక్ కంటే ముందు అక్షర్​ పటేల్‌ను బరిలోకి దింపింది టీమ్​ ఇండియా. ఆ మ్యాచ్​లో అక్షర్​ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఐదు బంతుల్లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు అతని ప్లేస్​లో దినేశ్ కార్తిక్​ రానున్నాడని సమాచారం.​ కార్తిక్ ఏస్​ ఫినిషర్‌గా ప్రసిద్ధి. అతను అక్షర్​ కంటే మెరుగైన బ్యాటింగ్ స్కిల్స్​ కలిగి ఉన్నాడని విశ్లేషకుల అభిప్రాయం.

3. చాహల్​ బదులు అశ్విన్​
యజువేంద్ర చాహల్ టీమ్​ ఇండియాలో ప్రీమియర్ స్పిన్నర్‌గా పేరొందాడు. ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లరో వికెట్లు అందించే సమర్థ్యం అతడి సొంతం. అయితే, ఇప్పుడు ఈ ఆటగాడు తన అత్యుత్తమ ప్రదర్శనను చూపించలేక విఫలమవుతున్నాడని సమాచారం. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. ఇప్పుడు ఇతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ని జట్టులోకి తీసుకోనున్నారని సమాచారం.​ టీ20లో అశ్విన్ అద్భుతంగా ఆడుతున్నాడు. గత టీ20 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి రన్ రేట్‌ను అదుపులో ఉంచుకున్నాడు. అనుభవజ్ఞుడైన ఆటగాడుగా అతనికి మంచి పేరుంది.

ఇదీ చదవండి: 'పాకిస్థాన్​ జెర్సీ పండ్ల దుకాణంలా ఉంది'.. మాజీ స్పిన్నర్​ సెటైర్​

నేడే ​ఇండియా-ఆస్ట్రేలియా రెండో టీ20 టికెట్‌ విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.