ETV Bharat / sports

సందిగ్ధంలో భారత్​-దక్షిణాఫ్రికా సిరీస్​.. కోహ్లీ స్పందన ఇదే! - టీమ్​ఇండియా దక్షిణాఫ్రికా సిరీస్​ వాయిదా

India team for south africa series: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్​- దక్షిణాఫ్రికా సిరీస్​పై సందిగ్ధం నెలకొంది. ఇదే విషయమై స్పందించిన కెప్టెన్​ కోహ్లీ.. తనకు కూడా పూర్తి స్పష్టత లేదన్నాడు. డిసెంబరు 17 నుంచి ప్రారంభం అవ్వాల్సిన ఈ సిరీస్​ను​ వారం రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

Team india south africa tour:, భారత్​-దక్షిణాఫ్రికా సిరీస్​ వాయిదా

author img

By

Published : Dec 2, 2021, 12:20 PM IST

Updated : Dec 2, 2021, 1:41 PM IST

Team india south africa tour: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ కారణంగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన సిరీస్​పై సందిగ్ధత నెలకొంది. ఇప్పుడు దీనిపై స్పందించిన కోహ్లీ.. ఈ విషయంపై తనకు కూడా పూర్తిగా అవగాహన లేదన్నాడు. బీసీసీఐతో చర్చిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ సిరీస్​ను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

"కరోనా కొత్త వేరియంట్​ కరాణంగా సిరీస్​ను వారం రోజులు వాయిదా వేయాలని అనుకున్నాం. ప్రస్తుతం ఇరు దేశాల బోర్డులు ఈ విషయమై చర్చలు జరుపుతున్నాయి. భారత ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. ప్లేయర్స్​ ఆరోగ్య, వారి భద్రతే తొలి ప్రాధాన్యం."

-బీసీసీఐ అధికారి.

ఈ నెల 17న సిరీస్​ ప్రారంభం అవ్వాలి. ఇరు జట్లు ముడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడనున్నాయి.

ఇదీ చూడండి: కరోనా కొత్త వేరియంట్.. సందిగ్ధంలో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్!

Last Updated : Dec 2, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.