ETV Bharat / sports

ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్​.. ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం.. నిప్పులు చెరిగిన షమీ - icc t20 world cup 2022

వరల్డ్​ కప్​లో భారత్​ శుభారంభం చేసింది. మొదటి వార్మప్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

icc t20 world cup 2022
icc t20 world cup 2022
author img

By

Published : Oct 17, 2022, 1:08 PM IST

వరల్డ్​ కప్​లో భారత్​ శుభారంభం చేసింది. మొదటి వార్మప్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు మంచి ప్రాక్టీస్ లభించింది. ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ (57), సూర్యకుమార్ యాదవ్ (50) అర్ధశతకాలు సాధించారు. హార్దిక్‌ పాండ్య (2) విఫలం కాగా.. రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (19), దినేశ్ కార్తిక్‌ (20) ఫర్వాలేదనిపించారు. దీంతో టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 6*, రవిచంద్రన్ అశ్విన్ 6 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ 4.. మిచెల్ స్టార్క్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆస్టన్‌ అగర్ తలో వికెట్ తీశారు.

రాహుల్ దూకుడు..
పెద్ద మైదానమైన బ్రిస్బేన్‌లో భారీ షాట్లు ఆడటం అంత సులువేం కాదు. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. ఆసీస్‌ బౌలింగ్‌ ఏమాత్రం లెక్క చేయకుండా మూడు సిక్స్‌లు బాదేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఔట్ కావడంతో భారత్‌ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది. కానీ విరాట్, సూర్య నిలకడగా ఆడారు. మరోసారి విరాట్‌తోపాటు హార్దిక్‌ వరుసగా పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లోకి వచ్చిన దినేశ్‌ కార్తిక్‌ భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సూర్యకుమార్‌ కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడి అర్ధశతకం సాధించాడు. అయితే చివరి ఓవర్‌లో ఔట్ అయ్యాడు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా ప్రారంభంలో భారత్​కు దీటుగా ఆడింది. ఓపెనర్లు మిచెల్​ మార్ష్(35), ఆరోన్ ఫించ్​(76) అద్భుత ప్రదర్శన చేశారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. స్మిత్(11), మ్యాక్స్​వెల్(23), స్టోనిస్(7), టిమ్ డేవిడ్​(5), కమ్మిన్స్(7), ఇంగ్లిష్(1), అగర్, స్టార్క్(0), కేన్ రిచర్డ్​సన్(0) పరుగులు చేశారు. కాగా, చాలా రోజుల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన భారత బౌలర్ మహ్మద్ షమీ.. 20వ ఓవర్​లో నిప్పులు చెరిగాడు. ఒక్క ఓవరే వేసినప్పటికీ.. యార్కర్లతో ఆకట్టుకున్నాడు. చివరి ఓవర్లో మొత్తం మూడు వికెట్లు తీశాడు. అదనంగా ఓ రనౌట్​ సైతం నమోదైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.