ETV Bharat / sports

నాలుగో టీ20లో టీమ్​ఇండియా ఆల్​రౌండ్ షో.. సిరీస్​ మనదే - ఇండియా విండీస్​ టీ20

విండీస్​తో ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమ్​ఇండియా అదరగొట్టింది. ప్రత్యర్థిపై 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మరో మ్యాచ్​ మిగిలి ఉండగానే సిరీస్​ కైవసం చేసుకుంది. బౌలర్లు అర్షదీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ రాణించారు.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Aug 7, 2022, 1:26 AM IST

Updated : Aug 7, 2022, 7:02 AM IST

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగులుండగానే భారత్‌ సొంతం చేసుకుంది. బ్యాటర్ల సమష్టికృషికి బౌలర్ల మెరుపుబంతులు తోడవ్వడంతో నాలుగో మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 ఆధిక్యంతో తన ఖాతాలో వేసుకుంది. ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో 59 పరుగుల తేడాతో విజయదుందుబి మోగించింది. టాస్‌ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషభ్‌పంత్‌ 44 (31 బంతుల్లో 6×4), రోహిత్‌ శర్మ 33 (16 బంతుల్లో 2×4,3×6), సంజూ శాంసన్‌ 30 నాటౌట్‌ (23 బంతుల్లో 2×4,1×6), సూర్య కుమార్‌ 24 (14 బంతుల్లో 1×4,2×6) దీపక్‌ హుడా 21 (19 బంతుల్లో 2×4), అక్షర్ 20నాటౌట్‌ (8 బంతుల్లో 1×4,2×6) సమష్టిగా రాణించడంతో భారత్‌ భారీ స్కోరు చేసింది.

.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ను భారత్‌ బౌలర్లు కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ స్కోరుబోర్డును ముందుకు కదలనివ్వలేదు. వెస్టిండీస్‌ బ్యాటర్లలో రోవ్‌మన్‌ పావెల్‌ (24), నికోలస్‌ పూరన్( 24) మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా..అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ తలో రెండు వికెట్లు తీశారు.

ఇదీ చూడండి: కామన్వెల్త్​ క్రికెట్​ ఫైనల్లో భారత్​ మహిళా జట్టు.. పతకం ఖాయం

Last Updated : Aug 7, 2022, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.